అంకుల్ బ్రతికి ఉంటే మీకు పగిలిపోయేది... శివాజీకి షాక్ ఇచ్చిన మంచు విష్ణు!

శివాజీ (Shivaji)సినీ ఇండస్ట్రీలో దాదాపు 90 కి పైగా సినిమాలలో నటించి గుర్తింపు సంపాదించుకున్నారు అయితే ఈయనకు క్రమక్రమంగా అవకాశాలు తగ్గిపోవడంతో పూర్తిగా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు.

ఇకపోతే శివాజీ బిగ్ బాస్ (Bigg Boss) కార్యక్రమంలోకి వచ్చిన తర్వాత ఈయన క్రేజ్ మరింత పెరిగిపోయింది.

బిగ్ బాస్ ముందు ఒక వెబ్ సిరీస్ లో నటించారు అయితే అది బిగ్ బాస్ పూర్తి అయిన తర్వాత విడుదల కావడం మంచి సక్సెస్ అందుకోవడం జరిగింది.ఇక ఈ సిరీస్ తర్వాత శివాజీ వరుస సినిమాలను అందుకుంటు బిజీగా ఉన్నారు .

Manchu Vishnu Counter To Hero Shivaji , Shivaji,vishnu, Court,srihari

తాజాగా నాని నిర్మాతగా, ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటించిన కోర్టు (Court)అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఈ సినిమాలో శివాజీ మంగపతి అని నెగిటివ్ షెడ్ ఉన్న పాత్రలో నటించారు.శివాజీ సినీ కెరియర్ లో ఈ పాత్ర ఎంతో హైలెట్ అని చెప్పాలి.

ఇక ఇందులో హీరోయిన్ కి మేనమామ పాత్రలో శివాజీ నటించారు.ఇక హీరోయిన్ కి తండ్రి చనిపోయి ఉంటారు ఆయన తండ్రి స్థానంలో నటుడు శ్రీహరి(Srihari) ఫోటోని చూపిస్తారు.

Advertisement
Manchu Vishnu Counter To Hero Shivaji , Shivaji,Vishnu, Court,Srihari -అంక

దాంతో ఈ సినిమాలో ఓ సన్నివేశంలో హీరోయిన్ నాన్నే బతుకుంటే ఇదంతా అయ్యేదా అని కన్నీళ్లు పెట్టుకుంటుంది.

Manchu Vishnu Counter To Hero Shivaji , Shivaji,vishnu, Court,srihari

ప్రస్తుతం శివాజీకి సంబంధించి సోషల్ మీడియాలో ఒక వీడియో ట్రోల్ అవుతుంది.అదేంటంటే మంచు విష్ణు(Manchu Vishnu) గతంలో మా ఎలక్షన్ సమయంలో శ్రీహరి అంకుల్ బతికి ఉంటే ఇదంతా జరిగేది కాదు.ఆయన మీకు సరైన గుణపాఠం చెప్పేవారు.

ఆన్సర్ ఇవ్వడానికి ఆయనే మీకు కరెక్ట్ మొగుడు అన్నట్లుగా మంచు విష్ణు మాట్లాడారు.అయితే మంచు విష్ణు మాట్లాడింది శివాజీని ఉద్దేశించి కాదు.

గతంలో మా ఎలక్షన్స్ సమయంలో రాజశేఖర్ జీవితలను ఉద్దేశించి మాట్లాడారు.కానీ అప్పుడు మంచు విష్ణు మాట్లాడిన మాటలను ప్రస్తుతం శివాజీకి సింక్ చేస్తూ ఈ వీడియోని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.

హీరో పాత్రకు కొత్త స్టైల్ తీసుకొచ్చింది పవన్ కళ్యాణ్.. సిద్ధు జొన్నలగడ్డ కామెంట్స్ వైరల్!
Advertisement

తాజా వార్తలు