దీన్నే మెదడు ఫుల్‌గా వాడటం అంటారు.. ఈ యువకుడి టెక్నిక్ చూస్తే స్టన్!

సాధారణంగా జీవితంలో సుఖంగా బతకాలంటే విద్యాబుద్ధులు బాగా నేర్చుకోవాలి.ఎంత జ్ఞానం ఉంటే అంత మంచిగా ఈ లోకంలో బతకవచ్చు.

 Man Uses Elastic Energy To Build Kinetic Energy And Making It Easier To Lift A H-TeluguStop.com

కష్టమైన పనులను సులభంగా కూడా పూర్తి చేయవచ్చు.అయితే కొంతమందికి విద్య లేకపోయినా తమ బుర్రకు పదును పెట్టి ఫిజిక్స్, కెమిస్ట్రీ ట్రిక్స్ ప్రయోగిస్తుంటారు.

ఫిజిక్స్( Physics ) ఇలా వర్క్ అవుతుందని, కెమిస్ట్రీ( Chemistry ) అలా పని చేస్తుందని వాళ్ళకి తెలిసిన, తెలియకపోయినా పనిచేస్తున్న కొద్దీ బుర్రకు పదును పెడుతున్న కొద్దీ వారికి రకరకాల విషయాలు తెలుస్తుంటాయి.

సాధారణంగా శారీరక పనిలో ఫిజిక్స్ చాలా వరకు ఉంటుంది.బరువు ఎత్తడం, మోయడం, ఇంకా రకరకాల ఫిజికల్ వర్క్స్ చేయడంలో ఫిజిక్స్ ఉపయోగపడుతుంది.ఈ ఫిజిక్స్‌లో కొన్ని మెలుకువలు తెలుసుకుంటే చాలు పనులు చాలా సులభతరం అవుతాయి.

అలాంటి ట్రిక్స్ తెలుసుకున్న ఒక వ్యక్తి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో( Social Media ) వైరల్ గా మారింది.వైరల్‌గా మారిన ఓ వీడియోలో సన్నగా ఉన్న బాలుడు బరువైన టైర్‌ను ఎత్తడానికి ఒక ట్రిక్ ప్రయోగించడం మనం చూడవచ్చు.

టైర్లు( Tyres ) చాలా బరువుగా ఉన్నందున వీటిని ఎత్తడం బలవంతులకు కూడా కష్టమే.

కానీ ఈ బలహీనమైన యువకుడు తన బలమైన బుర్రతో ఆలోచించి ఫిజిక్స్ ఉపయోగించి, ఆ టైరును ఎత్తడమే కాకుండా ట్రక్కు పైన( Truck ) విజయవంతంగా ఎక్కించగలిగాడు.నిజానికి, యువకుడు కైనెటిక్ ఎనర్జీని సృష్టించేందుకు ఎలాస్టిసిటీ పవర్ ఉపయోగించాడు, దీని వల్ల అత్యంత బరువైన టైర్‌ని కూడా ఈజీగా లిఫ్ట్ చేయగలిగాడు.టైర్‌ను కిందకి పైకి ఎగరవేస్తూ ఉంటే అది బౌన్సీగా మారి చివరికి చాలా ఎత్తుకు ఎదిగి ట్రక్కు పైకి ఎక్కగలిగింది.

కుర్రాడి తెలివిని నెటిజన్లు బాగా మెచ్చుకుంటున్నారు.ఈ వీడియోను @TansuYegen ట్విట్టర్‌ పేజీ షేర్ చేసింది.కేవలం 13 సెకన్ల ఈ వీడియోకు లక్షలలో వ్యూస్, వేలల్లో లైక్స్ వచ్చాయి.దీనిని మీరు కూడా చూసేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube