రికార్డు కోసం ఐస్‌బాక్స్‌లో 4 గంటలు నిలబడ్డాడు.. చివరికి ఏమైందో తెలిస్తే..

గిన్నిస్ వరల్డ్ రికార్డ్( Guinness World Record ) క్రియేట్ చేయడానికి చాలామంది తమ జీవితాలను, ప్రాణాలను పణంగా పెడుతుంటారు.

తాజాగా పోలాండ్‌కు చెందిన 53 ఏళ్ల లుకాస్జ్ స్జ్‌పునార్( Lukasz Szpunar ) కొత్త గిన్నిస్ వరల్డ్ రికార్డ్ నెలకొల్పడం కోసం ఎవరూ ఊహించలేని ఒక పెద్ద సాహసమే చేశాడు.

అతను నాలుగు గంటలకు పైగా మంచు ముక్కలతో నిండిన పెట్టె లోపల నిలబడ్డాడు.సరిగ్గా 4 గంటల 2 నిమిషాల పాటు నిలబడి, మునుపటి రికార్డును 50 నిమిషాల ఎక్కువ సమయంతో బద్దలు కొట్టాడు.

ఒక వ్యక్తి ఐస్‌తో పూర్తి శరీరాన్ని ఎక్కువసేపు కవర్ చేసుకోవడం ద్వారా ఈ రికార్డు క్రియేట్ చేయాల్సి ఉంటుంది.

దీనిని నెరవేర్చడానికి, లుకాజ్ తన మెడ వరకు మంచులో మునిగిపోయాడు, స్విమ్ ట్రంక్‌లను మాత్రమే ధరించాడు.చలి నుంచి దంతాలను రక్షించుకోవడానికి మౌత్‌గార్డ్‌ను ఉపయోగించాడు.ప్రారంభంలో, అతను కొంత అసౌకర్యాన్ని అనుభవించాడు, అది కాలక్రమేణా తగ్గింది.

Advertisement

ఈ సమయంలో అతని శరీర ఉష్ణోగ్రత( Body Temperature ), అతడి భద్రత కోసం డాక్టర్లు పర్యవేక్షించారు.అతను నాలుగు గంటల మార్కుకు చేరుకున్నప్పుడు, అతని క్షేమం కోసం అధికారులు ప్రయత్నాన్ని నిలిపివేయాలని నిర్ణయించుకున్నారు.

లుకాజ్ చలిని ఎంతో ఇష్టపడతాడు.చలిని తట్టుకునే వాల్‌రస్‌ ( Walruses ) జంతువులను బాగా అభిమానిస్తాడు.అంతేకాకుండా చలిలో ఓ పరీక్ష పెట్టుకోవాలని ఆయన అనుకుంటారు.

అందుకే, దాదాపు గడ్డకట్టే నీటిలో నాలుగు గంటలకు పైగా కూర్చొని ఓ పోలిష్ వాల్‌రస్ పోటీలో రెండవ స్థానం సాధించారు.కఠిన పనులు చేయడం ఆయనకు చాలా ఇష్టం.

అలాంటి పనులే తనని సంతృప్తి పరుస్తాయని అతను చెబుతున్నాడు.లుకాజ్ షార్ట్స్ ధరించి పోలాండ్‌లోని ఎత్తైన కొండలను ఎక్కారు.

మచ్చలు పోయి ముఖం తెల్లగా మారాలా.. అయితే ఈ రెమెడీని మీరు ట్రై చేయాల్సిందే!

అంతేకాకుండా, ప్రతినెలా ఒకసారి సూర్యోదయ సమయంలో చల్లని నీటితో నిండిన టార్నోబ్రెగ్ ( Tarnogbrzeg ) అనే సరస్సులో ఈత కొట్టే లేక్ ఆఫ్ ఏంజిల్స్ ( Lake of Angels ) కార్యక్రమాన్ని ఇతరులు కలిసి నిర్వహిస్తున్నారు.ఈ ఈత పోటీల ద్వారా వచ్చే నిధులను క్యాన్సర్ బాధిత పిల్లల హాస్పిటల్‌కు విరాళంగా ఇస్తారు.

Advertisement

తాజా వార్తలు