30 ఏళ్ల నాటి మాట కోసం... లాటరీలో వచ్చిన సొమ్ములో సగం ఇచ్చేసిన స్నేహితుడు...!

ప్రస్తుత రోజుల్లో ఇచ్చిన మాట మీద నిలబెట్టుకునే వారు చాలా అరుదు.అలా అని అందరూ అలానే ఉండరు.

కొంతమంది మాత్రం ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా కూడా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారు.ఇక మరికొందరు అయితే మాట ఇచ్చిన సమయంలో పరిస్థితి వేరు, ఇప్పుడు పరిస్థితి వేరు అని మాట మార్చి అక్కడి నుంచి పక్కకు వెళ్ళి పోతారు.

ఇక ఇలాంటివి ఎక్కువగా పెళ్లి సందర్భాల్లో జరుగుతుంది.అయితే తాజాగా ఒక స్నేహితుడు మాత్రం తన దోస్తు కు ఇచ్చిన మాట మీద నిలబడ్డాడు.30 సంవత్సరాల కిందట తన మిత్రుడికి ఇచ్చిన మాటపై నిలబడి నలుగురికి ఆదర్శంగా నిలబడ్డాడు.లాటరీలో గెలిచిన మొత్తం డబ్బులలో సగం ఆనందంగా తన స్నేహితునికి ఇచ్చాడు.

ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.అమెరికాలోని విస్కాన్సిన్‌కు చెందిన టామ్ కుక్‌, జోసెఫ్ ఫీనీ ఈ ఇద్దరు మంచి ప్రాణ స్నేహితులు.

Advertisement

వీరిద్దరికీ గత కొన్ని సంవత్సరాలుగా లాటరీ టికెట్లు కొనే అలవాటు బాగా ఉంది.ఈ తరుణంలో వీరిద్దరు ఎవరికీ లాటరీ వచ్చినా కూడా వచ్చిన డబ్బులు ఇద్దరూ సమానంగా పంచుకోవాలని 30 సంవత్సరాల కిందట ఒక మాట అనుకున్నారు.

ఇందుకు అనుకున్నట్లుగానే 30 సంవత్సరాల తర్వాత గత నెలలో టామ్ కు పవర్ బాల్ జాక్ పాట్ లో దాదాపు 164 కోట్లు సొంతం చేసుకున్నాడు.అంత డబ్బు వచ్చాక ఎవరైనా మాట నిలబెట్టుకోకుండా ఉండాలనుకుంటారు.

కానీ, ఇతను మాత్రం ఇచ్చిన మాట మీద నిలబడి తన స్నేహితుడికి గెలుచుకున్న డబ్బులు సగభాగం జోసఫ్ ఫీనీ కి ఇచ్చాడు.దీనితో జోసఫ్ ఆనందానికి హద్దులు లేకుండా అయిపోయాయి.

అంతేకాకుండా మొదటిలో తన ఫ్రెండ్ టామ్ టు జాక్ పాట్ తగిలిన విషయం తను నమ్మలేదని తన భావాలను తెలిపాడు.

వీడియో వైరల్ : శోభనం గదిలో ఆలియా, రణ్ వీర్.. ఇదే తొలిసారి అంటూ..

Advertisement

తాజా వార్తలు