తన మూత్రం తానే తాగేస్తున్నాడు... ఇది చదివిన తర్వాత మీరు ఏమంటారు

నేషనల్‌ జియోగ్రఫీ ఛానెల్‌ లో ఒక కార్యక్రమం వస్తుంది, అందులో వ్యాఖ్యత అడవిలో అన్వేషిస్తూ వెళ్తూ ఉంటాడు, అతడికి నీళ్లు లేని సమయంలో తన మూత్రానే తాగుతూ ఉంటాడు.

అందులో ఎంత నిజం ఉందో తెలియదు కాని ఇంగ్లాండ్‌ కు చెందిన ఈ వ్యక్తి మాత్రం ప్రతి రోజు కూడా తన మూత్రంను తానే తాగుతూ ఉంటాడు.

ఇతడు నీళ్లు లేక తాగడమో లేదంటే మరేదో సాహసం కోసమో ఇలా చేయడం లేదు.అతడి ఆరోగ్యం కోసం ఇలా చేస్తున్నాడు.

ప్రపంచం దృష్టిని ఆకర్షించిన ఈ వ్యక్తి గురించి తెలుసుకునేందుకు అంతా ఆసక్తి చూపుతున్నాడు.మూత్రం తాగుతూ తన ఆరోగ్యం కాపాడుకుంటున్నాను అంటూ ఇతడు చెప్పిన విషయం వైరల్‌ అవ్వడంతో మూత్రం వల్ల ఉపయోగాలు ఏంటీ అంటూ ఎంతో మంది నెట్‌ లో సెర్స్‌ చేస్తున్నారు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.ఇంగ్లాండ్‌ కు చెందిన ఫబియన్‌ ఫర్కుహర్సాన్‌ అనే వ్యక్తికి కొన్నాళ్ల క్రితం అనారోగ్యం చేసింది.

Advertisement

అప్పట్లో విపరీతంగా జంక్‌ ఫుడ్‌ తినడం వల్ల తీవ్ర కడుపు నొప్పితో బాధపడ్డాను.ఆ సమయంలో నేను చనిపోతానేమో అని అనుకున్నాను.

వైధ్యుల వద్దకు వెళ్లినా కూడా నా కడుపు నొప్పికి పరిష్కారం దొరకలేదు.నా కడుపు నొప్పి పరిష్కారం కోసం నేను నెట్‌ లో సెర్స్‌ చేశాను.

ఆ సమయంలోనే నాకు మనిషి మూత్రం తాగితే మంచిది అని శాస్త్రవేత్తలు చెప్పిన విషయం కంట పడింది.మొదట నేను అందుకు ఇష్ట పడలేదు.

కాని కడుపు నొప్పి భరించడం కంటే మూత్రం తాగడం బెటర్‌ కదా అనిపించింది.అందుకే మూత్రం తాగడం ప్రారంభించాను.

ఉదయాన్నే నీళ్లలో తేనెను కలుపుకొని తాగుతున్నారా? అయితే ఈ జాగ్రత్తలు తప్పనిసరి..

నేను ఎప్పుడైతే మూత్రం తాగడం మొదలు పెట్టానో రెండు మూడు రోజుల్లోనే నా కడుపు నొప్పి తగ్గడం మొదలైంది.మొదట మూత్రంను పట్టి వెంటనే తాగే వాడిని.కాని ఇప్పుడు మూత్రం నిల్వ ఉంచి తాగడంకు ప్రయత్నిస్తున్నాను.

Advertisement

మూత్రం నిల్వ ఉంచి తాగితే ఇంకా ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయని నేను భావిస్తున్నాను.అందుకోసం పరిశోదన చేస్తున్నాను అంటున్నాడు.

మూత్రం రుచి ఆల్కహాల్‌ మాదిరిగా కాస్త వగరుగా, స్ట్రాంగ్‌గా అనిపిస్తుంది, అస్సలు రుచిగా ఉండదు.కాని తప్పనిసరి పరిస్థతుల్లో గ్లాస్‌ మూత్రంను కష్టంగా అయినా అవలీలగా తాగేయగలను.

మద్యం బాటిల్‌ లో మూత్రంను 30 రోజులు నిల్వ ఉంచి తాగితే బాగుంటుందని నాకు అనిపిస్తుంది.

నేను మూత్రం తాగినప్పటి నుండి చిన్న అనారోగ్య సమస్య కూడా నా దరికి చేరలేదు.నేను మూత్రం తాగుతున్నందుకు సిగ్గు పడటం లేదు.ఎందుకంటే అది నా ఆరోగ్యంను కాపాడుతుంది.

మద్యం తాగే వారి కంటే మూత్రం తాగేవారు చెడ్డ వారు ఏమీ కాదు అనేది నా అభిప్రాయం అంటూ తను చేసే పనిని ఫబియన్‌ సమర్ధించుకుంటున్నాడు.మొత్తానికి ఈయన చేస్తున్న పని అందరికి ఆశ్చర్యంను కలిగిస్తుంది.

తాగితే బాగానే ఉంటుందనిపించినా ఇలాంటి సాహసం మాత్రం మీరు చేయకండి.మన వద్ద అలా చేస్తే పిచ్చి వాడు అనుకునే ప్రమాదం ఉంది.

తాజా వార్తలు