వైరల్: దెబ్బకు దొంగ దొరికిపోయాడు... కాలమే అతని ముసుగు తొలగించిందిలా?

సోషల్ మీడియాను ఓ వైరల్ వీడియో కుదిపేస్తోంది.నిత్యం ఇక్కడ అనేక వీడియోలు నెటిజన్లకు తారసపడుతూ ఉంటాయి.

అయితే అందులో ఏ కొన్నో జనాలకు బాగా నచ్చుతాయి.అలా నచ్చిన వీడియోని జనాలు ఆకాశానికెత్తేస్తారు.

అదేనండి.తమ తమ సర్కిల్ లో వైరల్ చేస్తూ వుంటారు.

ఇక్కడ కూడా అలాంటిదే జరిగింది.ఇక్కడ సీన్ చూస్తే సింహాద్రి సినిమాలో వేణుమాధవ్ గుర్తుకు వస్తాడు అంటే మీరు నమ్మితీరాల్సిందే.

Advertisement
Man Pretends To Be Physically Handicapped Exposed Details, Prank , Viral Latest,

అదే.ఆ సినిమాలోని కాళ్లు పడిపోయినట్లు నటిస్తూ వీల్ చైర్‌లో కూర్చుని వైద్యశాలలో పెట్టే ఉచిత ఆహారాన్ని ముప్పొద్దులా మెక్కేస్తుంటాడు.

ఆ సీన్.మీకు గుర్తుంది కదూ.కావాలంటే ఇక్కడ వీడియో చూడండి.మీకు పై సీన్ గుర్తుకు రాకపోతే అప్పుడడగండి! కాగా వైరల్ అవుతున్న వీడియోని చూసి నెటిజన్లు సైతం షాక్ అవుతున్నారు.

ఇలాంటివి సినిమాలలో చూసాం గాని, ఇలా నిజ నిజజీవితంలో కూడా ఉంటారని ఫస్ట్ టైం చూస్తున్నాం అని కింద కామెంట్స్ చేస్తున్నారు.కొంతమందైతే పొట్టచెక్కలయ్యేలా నవ్వుకుంటున్నారు.

Man Pretends To Be Physically Handicapped Exposed Details, Prank , Viral Latest,

విషయంలోకి వీలైతే, వైరల్ అవుతున్న వీడియోని ఒక్కసారి మీరు గమనిస్తే.అచ్చం కుంటివాడిలా నటిస్తూ.ఓ వ్యక్తి వీల్‌చైర్‌లో కూర్చుని బిక్షాటన చేస్తున్నాడు.

Red Eyes : కళ్లు ఎర్రగా ఉండడం ఏ వ్యాధి లక్షణమో తెలుసా..?

ఆ విషయం తెలియని అమాయక గొర్రెలు అదేనండి.మన ప్రజలు వాడికి డబ్బులు కుమ్మరిస్తున్నారు.బహుశా! వాడికి రోజూ అదేపని అని అర్ధం చేసుకోవచ్చు.

Advertisement

ఈ క్రమంలో ఆటగాడు వీల్‌చైర్‌ను రోడ్డుపై నెట్టుకుంటూ రోడ్డుదాటేందుకు ప్రయత్నిస్తాడు.ఇంతలో ఊహించని ఉపద్రవం.

అతని వీల్ చైర్ వైపు ఓ వైక్ రెప్పపాటు వేగంతో దూసుకొచ్చింది.కట్ చేస్తే ఆ మాయదారి భయపడి ఒక్కసారిగా పైకి లేచి పరుగులు తీయడం ఇందులో చూడవచ్చు.

తాజా వార్తలు