చైనీస్ వెబ్‌సైట్లను నమ్మితే అంతే.. డ్రిల్ ఆర్డర్ చేస్తే ఏమొచ్చిందో చూడండి..

అమెరికాలోని( America ) జార్జియాకు చెందిన 68 ఏళ్ల వృద్ధుడు సిల్వెస్టర్ ఫ్రాంక్లిన్( Sylvester Franklin ) ఆన్‌లైన్ మోసగాళ్ల వలలో చిక్కుకున్నారు.

చైనాకు( China ) చెందిన ప్రముఖ ఆన్‌లైన్ స్టోర్ అయిన అలీఎక్స్‌ప్రెస్( AliExpress ) లో డ్రిల్ మిషన్ ఆర్డర్ చేస్తే, అతనికి డ్రిల్ మిషన్ ఫొటో మాత్రమే వచ్చింది.

నవంబర్ నెలలో డ్రిల్ మిషన్, ప్రెజర్ వాషర్ కలిపి కేవలం 40 డాలర్లకు ఆర్డర్ చేశాడు ఫ్రాంక్లిన్.ఇంత తక్కువ ధరలో లభిస్తుండటంతో అతను నిజంగానే మంచి డీల్ దొరికిందని సంబరపడ్డాడు.

డిసెంబర్‌లో పార్సిల్ రాగానే ఆత్రుతగా తెరిచి చూసిన ఫ్రాంక్లిన్‌కు షాక్ తగిలింది.అందులో డ్రిల్ మిషన్( Drill Machine ) బదులు కేవలం దాని ఫొటోను ముడతలు పెట్టి పంపించారు.

అంతేకాదు, దానితో పాటు ఒకే ఒక్క స్క్రూ కూడా వేశారు."నేను 40 డాలర్లు చెల్లించాను, కానీ నాకు డ్రిల్ బొమ్మ, ఒక స్క్రూ మాత్రమే వచ్చాయి.

Advertisement

నేను చాలా బాధపడ్డాను," అని ఫ్రాంక్లిన్ వాపోయాడు."ఇది నిజంగా దారుణం.

వెంటనే వాళ్లకు రిఫండ్ కోసం మెసేజ్ పెట్టాను" అని తెలిపాడు.

ఫ్రాంక్లిన్ వెంటనే ఆన్‌లైన్ విక్రేతను సంప్రదించడానికి ప్రయత్నించాడు, కానీ ఇప్పటివరకు సరైన స్పందన లేదు.రిఫండ్ వచ్చేలా కూడా కనిపించడం లేదు.తీవ్ర నిరాశ చెందిన ఫ్రాంక్లిన్, "మోసం చేయకండి.

డబ్బులు తీసుకుంటే, వస్తువు ఇవ్వండి" అంటూ మిగతా వినియోగదారులను హెచ్చరించాడు.

ఎంత ప్రయత్నించినా జుట్టు రాలడం ఆగట్లేదా.. అయితే మీరు ఇది ట్రై చేయాల్సిందే!

ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో చాలా మంది నెటిజన్లు ఇలాంటి అనుభవాలను పంచుకున్నారు.కొందరు ఫ్రాంక్లిన్‌ను చైనీస్ దరిద్రపు వెబ్‌సైట్‌ను నమ్మినందుకు విమర్శించారు."ఇలాంటి మోసాలు ఈబే( eBay ), ఫేస్‌బుక్ మార్కెట్‌ప్లేస్( Facebook Marketplace ) వంటి వెబ్‌సైట్లలో కూడా సాధారణం," అని ఒకరు కామెంట్ చేశారు.మరొకరు వ్యంగ్యంగా "నేను 1.09 డాలర్లకు ఫెరారీ కారు బొమ్మ ఆర్డర్ చేస్తే, వాళ్లు నిజమైన ఫెరారీ కారు పంపించారు." అని జోక్ చేశారు.

Advertisement

ఇంకొక నెటిజన్ "అసలు విషయం ఏమిటంటే, ఒక డ్రిల్, పవర్ వాషర్ కేవలం 42 డాలర్లకు వస్తాయని ఎలా నమ్మారు?" అని ప్రశ్నించారు.అలీఎక్స్‌ప్రెస్ చైనాకు చెందిన అలీబాబా సంస్థ యాజమాన్యంలో నడుస్తుంది.

దీన్ని "చైనా అమెజాన్" అని కూడా అంటారు.ఈ ప్లాట్‌ఫామ్‌లో రకరకాల వస్తువులు అందుబాటులో ఉన్నా, చాలా మంది కస్టమర్లు మోసపూరిత విక్రేతల గురించి ఫిర్యాదు చేస్తున్నారు.

బెటర్ బిజినెస్ బ్యూరో (BBB) అలీఎక్స్‌ప్రెస్‌కు D-రేటింగ్ ఇచ్చింది.అంతేకాకుండా, 1,100 కంటే ఎక్కువ కస్టమర్ ఫిర్యాదులకు ఈ సంస్థ స్పందించలేదు.

తాజా వార్తలు