వీడియో: ట్రైన్ బోగీ మెట్లపై కూర్చున్న వ్యక్తి.. జారిపోవడంతో..?

చెన్నై రైల్వే స్టేషన్‌లో ఓ విషాదం చేసుకుంది.ఓ యువకుడు రైలు నుంచి కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు.

ఆ మృతుడు పేరు బాల మురుగన్ (24)( Bala Murugan ) అని పోలీసులు గుర్తించారు.ఈ యువకుడు ఘటన చోటు చేసుకున్న సమయంలో వైగై ఎక్స్‌ప్రెస్( Vaigai Express ) రైలులో ప్రయాణిస్తున్నాడు.

సరిగ్గా సైదాపేట రైల్వే స్టేషన్‌ వద్ద రైలు నుంచి కింద పడి మరణించాడు.బాల మురుగన్ రైలు బోగీలోని మెట్ల వద్ద కూర్చున్నాడు.

రైలు వేగంగా వెళుతుంటే ఒక్కసారిగా మెట్ల పైనుంచి రైల్వే ప్లాట్‌ఫామ్ పై పడిపోయాడు.ఈ విషాద ఘటన మొత్తం సీసీ కెమెరాల్లో రికార్డయ్యింది.

Advertisement
Man Dies After Falling From Moving Train At Chennai Station Video Viral Details,

గురువారం ఈ సంఘటన చోటుచేసుకుంది.

Man Dies After Falling From Moving Train At Chennai Station Video Viral Details,

సోషల్ మీడియాలో ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది ఆ వీడియో సీసీ కెమెరా ద్వారా రికార్డు అయింది.అందులో బాలమురుగన్ రైలులోని ఒక బోగీ దగ్గర స్టెప్స్‌పై కూర్చున్నట్లు కనిపిస్తోంది.రైలు సైదాపేట రైల్వే స్టేషన్( Saidapet Railway Station ) దాటినప్పుడు, బాలమురుగన్ కాలు ప్లాట్‌ఫామ్‌ గోడకు రైలుకు మధ్య చిక్కుకుపోయింది.

ఈ కారణంగా అతను చాలా బలంగా కిందకు పడిపోయి, దాదాపు 30 అడుగుల దూరం వరకు ఈడ్చుకెళ్లబడ్డాడు.చివరకు అతని తల వేగంగా వస్తున్న రైలుకు గుద్దుకుంది.

Man Dies After Falling From Moving Train At Chennai Station Video Viral Details,

పోలీసుల ప్రకారం, బాలమురుగన్ మధ్యాహ్నం 1:30 గంటలకు ఎగ్మూర్ రైల్వే స్టేషన్ నుంచి వైగై ఎక్స్‌ప్రెస్ రైలు ఎక్కి ప్రయాణించాడు.ఈ దుర్ఘటన మధ్యాహ్నం 2 గంటలకు సైదాపేట రైల్వే స్టేషన్ వద్ద జరిగింది.కడలూరు నివాసి అయిన బాలమూరుగన్ అక్కడికక్కడే మరణించాడు.

షూటింగ్ కోసం వెళ్లి చిక్కుకున్న బాలకృష్ణ ,కృష్ణం రాజు..బిస్కట్స్, చేపలతో ప్రాణం కాపాడుకున్నారు

రైల్వే పోలీసులు ఆయన మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం కోసం పంపించారు.ఈ ఘటనపై కేసు నమోదు రిజిస్టర్ అవ్వగా, దర్యాప్తు కొనసాగుతోంది.

Advertisement

తాజా వార్తలు