సెల్ఫీ తీసుకోవడానికి రైలు ఎక్కిన యువకుడు.. లాస్ట్ ట్విస్ట్ ఏంటంటే!

సెల్ఫీ పిచ్చితో ఇప్పటికే ఎందరో మరణించారు.అయినా కూడా ఈ సెల్ఫీ పిచ్చి జనాల్లో ఇంకా పోలేదు.

 Man Died While Taking Selfie On A Good Train Details,  Train, Selfie, Viral Late-TeluguStop.com

ఏదైనా సాహసోపేతమైన ప్రదేశం లో సెల్ఫీ దిగి అందర్నీ ఆకట్టుకోవాలని చాలామంది పిచ్చి పనులు చేస్తున్నారు.ఈ క్రమంలోనే ఒక యువకుడు సైతం సెల్ఫీ కోసం ఒక పెద్ద పిచ్చి పని చేశాడు.

ఇలాంటి మూర్ఖపు పని వల్ల అతడు ఏకంగా ప్రాణాలే కోల్పోయాడు. ఈ ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం అవుతోంది.

వివరాల్లోకి వెళితే.ఒక యువకుడు గూడ్సు రైలు ఎక్కి ఫొటో దిగాలి అనుకున్నాడు.అయితే యువకుడు రైలు ఎక్కుతుండగా చాలామంది వద్దని వారించారు.అయినా తనకు ఏమవుతుందిలే అని ఒక పిచ్చి నమ్మకంతో అతడు అలాగే పైకి ఎక్కి సెల్ఫీ తీసుకోడానికి సిద్ధమయ్యాడు.

అయితే రైలు బోగిపై అతడు బ్యాలెన్స్ తప్పాడు.కింద పడి పోకుండా పైనే ఉన్న ఒక హై టెన్షన్ కరెంటు వైర్‌ని పట్టుకున్నాడు.

అంతే క్షణాల్లోనే అతడి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి.

ఈ యువకుడి ఆకాశ్‌ ఇనిస్టిట్యూట్‌కు చెందిన విద్యార్థి అని ఐడీ కార్డు ద్వారా పోలీసులు గుర్తించారు.

ఘటన జరిగిన వెంటనే అక్కడే ఉన్న స్థానికులు అతన్ని ఆస్పత్రికి తరలించారు కానీ యువకుడు అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు.ఈ ఘటన గురించి పోలీసులకు తెలియజేశామని ఆర్పీఎఫ్ ఇన్‌ఛార్జ్ ఉషా నిరంకారీ మీడియాకు వెల్లడించారు.

Telugu Akash Institute, Raghav Aggarwal, Selfie, Selfie Craze, Selfie Train, Tra

గూడ్స్ రైలుపైకి ఎక్కి సెల్ఫీ తీసుకుంటున్న సమయంలో విద్యుదాఘాతానికి గురై ఓ యువకుడు మృత్యువాత పడినట్లు తమకు కొందరు ఫోన్ చేసి చెప్పారని జీఆర్పీ పోలీస్ స్టేషన్‌ అధికారి ఓం ప్రకాశ్ సైనీ పేర్కొన్నారు.ఈ ఘటనలో చనిపోయిన వ్యక్తిని రాఘవ్ అగర్వాల్‌గా పోలీసులు గుర్తించారు.అనంతరం బాడీని హ్యాండ్ ఓవర్ చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం హాస్పిటల్ కి తరలించారు.

కొద్ది రోజుల క్రితం ఇలాంటి ఒక దుర్ఘటనే చోటు చేసుకుంది.

ఉత్తర ప్రదేశ్ లోని గోరఖ్‌పూర్-నర్కతీయగంజ్ రైలు మార్గంలో ఒక యువకుడు చనిపోయాడు.చితౌని-బహాన్ రైలుపై ఒక వ్యక్తి సెల్ఫీ తీసుకుంటుండగా సత్యాగ్రహ ఎక్స్‌ప్రెస్ అతన్ని బలంగా ఢీకొట్టింది.

దీంతో అతడి శరీరం తునాతునకలు అయింది.ఈ ఘటనలను చూసైనా సెల్ఫీ మోజులో పడి ప్రాణాలు తీసుకోవద్దని పోలీసులు ప్రజలకు సూచిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube