ఈజీ మనీ కోసం మాస్టర్‌ప్లాన్.. పోలీసుల ఎంట్రీతో ఊహించని ట్విస్ట్

కొంత మందికి ఏ పనీ చేయకుండానే డబ్బులు సంపాదించాలనే కోరిక ఉంటుంది.ఈజీ మనీ కోసం అడ్డదారులు తొక్కుతుంటారు.

ప్రజలను సులువుగా మోసం చేసి డబ్బులు వెనకేసుకోవాలని భావిస్తుంటారు.అలా చేసి, ఒక్కోసారి పోలీసులకు అడ్డంగా దొరికి పోతారు.

తాజాగా ఇలాంటి ఓ ఘటన బయటపడింది.ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్ జిల్లాలోని ఒక గ్రామంలో ఓ వ్యక్తి, అతని ఇద్దరు కుమారులు త్వరగా డబ్బు సంపాదించడానికి మరియు ప్రజాదరణ పొందేందుకు అద్భుతం కథ వండి వార్చారు.

ఉన్నావ్ జిల్లాలోని మహ్మద్‌పూర్ గ్రామానికి చెందిన అశోక్ కుమార్, అతని కుమారులు రవి, విజయ్‌లు ఇటీవల ఆన్‌లైన్‌లో కొన్ని లోహపు దేవుళ్ల విగ్రహాలను కొనుగోలు చేసి తమ పొలంలో పాతిపెట్టారు.మరుసటి రోజు, తమ పొలంలో కాపు సమయంలో విగ్రహాలు బయటపడ్డాయని ప్రచారం చేశారు.

Advertisement

విగ్రహాల ఉనికి గురించి వారు తమకు కల వచ్చిందని అందరికీ చెప్పారు.అంతా ముందుగా అనుకున్న ప్రకారం జరిగింది.

విగ్రహాలను చూసేందుకు భారీగా తరలివచ్చిన జనం ‘అద్భుతం’ గురించి చర్చించి నైవేద్యాలు సమర్పించారు.సమాచారం అందుకున్న పోలీసులు విగ్రహాల గురించి పురావస్తు శాఖకు సమాచారం అందించారు.

విగ్రహాలు పురాతనమైనవిగా కనిపించకపోయినా కొత్తవిగా కనిపించడంతో అనుమానం వచ్చి విచారణ ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు.రూ.169కి రవి విగ్రహాల సెట్‌ను ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసినట్లు స్థానికులు వెల్లడించారు.

ఆన్‌లైన్ వెబ్‌సైట్ డెలివరీ మ్యాన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.వెంటనే అశోక్ కుమార్, అతని కుమారులను అరెస్టు చేశారు.గంటల తరబడి విచారించిన అనంతరం ఆన్‌లైన్‌ వెబ్‌సైట్‌లో విగ్రహాలను కొనుగోలు చేసి ప్రముఖులు, ధనవంతులు కావడానికి వాటిని పొలంలో పాతిపెట్టినట్లు అంగీకరించారు.సుమారు రూ.30 వేల విరాళాలు సేకరించినట్లు పోలీసు వర్గాలు చెబుతున్నాయి.వారు ప్రచారం చేసి, గ్రామస్తులను బురిడీ కొట్టించారు.

మోకాలి నొప్పులు నివారించాలంటే.. ఇలా చెయ్యండి..!

ఈ విగ్రహాలను ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసినట్లు విచారణలో తేలిందని బంగార్‌మావు సర్కిల్ అధికారి పంకజ్ సింగ్ తెలిపారు.నిందితులపై అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు.

Advertisement