అమోఘం.. కొన్న సరుకులకు క్యారీ బ్యాగ్ ఇవ్వలేదని ఏకంగా?(వీడియో)

నిత్యం సోషల్ మీడియాలో అనేక వీడియోలు వైరల్ అవుతూనే ఉంటాయి.

ప్రపంచంలో ఏ మూలన ఏమి జరిగినా కానీ సోషల్ మీడియా ద్వారా అందరికి ఇట్లే తెలిసిపోతుంది.

ఇలా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలలో( Viral Video ) కొన్ని వీడియోలు అందర్నీ ఆలోచించే విధంగా ఉంటాయి.ఇక మరికొన్ని అయితే ఫన్ ను క్రియేట్ చేస్తూ ఉంటాయి.

అచ్చం అలాంటి సంఘటననే ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా చక్కర్లు కొడుతుంది.ఒక యువకుడు షాపింగ్ కు( Shopping ) వెళ్ళిన క్రమంలో లగేజ్ బ్యాగు( Luggage Bag ) లేదని విన్తునంగా ఆలోచించిన తీరు అందర్నీ ఎంతగానో ఆకట్టుకుంది.

అసలు విషయానికి వెళ్తే.

Advertisement

ఒక వ్యక్తి షాపింగ్ చేసేందుకు ఒక ప్రముఖ మాల్ కు వెళ్లాడు.ఈ క్రమంలో షాపింగ్ మొత్తం పూర్తి అయిన తర్వాత అతడి వద్ద లగేజ్ కవర్ లేకపోవడంతో కాస్త కొత్తగా ఆలోచించి తన దగ్గర ఉన్న ప్యాంటు చూడగానే అతడికి ఒక ఐడియా రావడంతో.షార్ట్ కింద బాగాన కాళ్ళ దగ్గర తాడును కట్టి అనంతరం తాను మాల్ లో కొనుగోలు చేసిన వస్తువులు అన్నీ కూడా అందులో వేసుకొని వెళ్ళాడు.

ఇలా ఆ వ్యక్తి తాను కొనుగోలు చేసిన సరుకులన్నీ ఇలా షార్ట్ ప్యాంట్ లో( Short Pant ) తీసుకొని వెళ్లడం అక్కడ ఉన్న వారందరికీ ఆశ్చర్యం కలుగజేసింది.అంతేకాకుండా సరుకులను తనిఖీ చేస్తున్న సమయంలో అక్కడున్న సదరు మహిళ కూడా అతని తెలివి చూసి నవ్వు ఆపుకోలేక పోయింది.

అలాగే అక్కడ ఉన్న వారందరూ కూడా ఈ వింత క్యారీ బ్యాగును చూసి నవ్వు ఆపుకోలేకపోయారు.

ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా చక్కర్లు కొడుతూ ఉండడంతో సోషల్ మీడియా వినియోగదారులు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.బ్రదర్ ఇలాంటి ఐడియాలు మీకు ఎక్కడి నుంచి వస్తాయని కొందరు కామెంట్ చేస్తూ ఉంటే.మరికొందరు వివిధ రకాల ఏమోజీలతో కామెంట్స్ చేస్తున్నారు.

పుష్పక్ ఎక్స్‌ప్రెస్‌ నుంచి దూకిన ప్రయాణికులు.. వేరే ట్రైన్ కింద నలిగిపోయి.. ఘోర వీడియో!
చెక్‌బౌన్స్‌ కేసులో రామ్ గోపాల్ వర్మకు మూడు నెలల జైలు శిక్ష

ఏది ఏమైనా ఈ యువకుడి తెలివికి కొందరు సలాం కొడుతున్నారు.

Advertisement

తాజా వార్తలు