రాజకీయంగా తెలుగు దేశం పార్టీ మంచి ఊపు మీద ఉంది.వైసిపి ప్రభుత్వంపై జనాల్లో వ్యతిరేకత పెరిగిందని, టీడీపీకి రాబోయే ఎన్నికల్లో అవకాశం ఉందని నమ్మకం పెట్టుకున్నారు.
అంతే కాకుండా బిజెపి , జనసేన టిడిపి కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తాయని ఎన్నికల నాటికి వైసీపీకి మరింత గడ్డుకాలం తప్పదని బాబు అంచనా వేస్తున్నారు.ఇదే సమయంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చంద్రబాబు పై సంచలన ఆరోపణలు చేశారు.
అప్పట్లో ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పెగాసెస్ సాఫ్ట్ వేర్ వ్యవహారం లో కేంద్ర ప్రభుత్వం తీవ్ర విమర్శలను ఎదుర్కొంది.రాజకీయ ప్రత్యర్థులను అణిచివేసేందుకు వారి వివరాలను తెలుసుకునేందుకు వారి ఫోన్లను పెగాసెస్ సాప్ట్ వేర్ ద్వారా నిఘా పెట్టారనే విమర్శలను ఎదుర్కొంది. ఈ విషయంలో పార్లమెంట్ లో సైతం బిజెపి విమర్శలు ఎదుర్కొంది.ఈ వ్యవహారం లో చంద్రబాబు పాత్ర కూడా ఉందనే విషయాన్ని బయటపెట్టారు .చంద్రబాబు పెగాసెస్ సాప్ట్ వేర్ కొన్నారని ఆమె ప్రకటించారు. ఇజ్రాయిల్ కు చెందిన ఎస్ఎస్సి కంపెనీ తమను సంప్రదించలేదని, తాము దానిని తిరస్కరించామని , కానీ అప్పట్లోనే చంద్రబాబు ఈ సాప్ట్ వేర్ ను కొన్నారని ఆమె ప్రకటించారు.
ఆమె ఈ ప్రకటన చేయడానికి గల కారణాలు ఏమిటి అనేది స్పష్టంగా తెలియనప్పటికీ, ఈ వ్యవహారంలో చంద్రబాబు పాత్ర కూడా ఉంది అనే విషయం హైలెట్ అయ్యింది.

ఇక ఈ విషయంపై టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పందించారు.మమతా బెనర్జీ చంద్రబాబుపై ఎందుకు విమర్శలు చేశారు అనేది తెలియదు కానీ, ఆ సాప్ట్ వేర్ ను అప్పట్లో తమ ప్రభుత్వం కొనలేదని, మమతా బెనర్జీ కి సరైన సమాచారం లేకపోవడంతో నే, అలా మాట్లాడి ఉంటారని ఆయన అభిప్రాయపడ్డారు.ఇజ్రాయిల్ కు చెందిన ఎస్ ఎస్ఓ గ్రూప్ నుంచి కేంద్రం పెగాసెస్ ను కొనుగోలు చేసినట్లు మాత్రం విమర్శలు ఎదుర్కొంది.
ఇప్పుడు చంద్రబాబు విమర్శలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఎదురవుతోంది.ఈ విషయం మరింత హైలెట్ చేసి టిడిపిని ఇరుకున పెట్టేందుకు వైసిపి మరింత సమాచారాన్ని సేకరిస్తోంది.ఏమైనా మమత వ్యాఖ్యలతో ఏపీ రాజకీయ సునామి మొదలు అయ్యే అవకాశం లేకపోలేదు.ఈ విషయంలో చంద్రబాబు ఏవిధంగా స్పందిస్తారో అనేది తేలాల్సి ఉంది.







