నాలుగు రాజధానులు అంటూ సరికొత్త కామెంట్లు చేసిన మమతా బెనర్జీ..!!

త్వరలో పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.

దీంతో జరగబోయే ఎన్నికలలో బెంగాల్ రాష్ట్రంలో రాజకీయ వాతావరణం చూస్తే బీజేపీ వర్సెస్ తృణమూల్ కాంగ్రెస్ అన్నట్టుగా ఉంది.

పరిస్థితి ఇలా ఉండగా అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఇటీవల బిజెపిలో జాయిన్ అవుతూ ఉన్నారు.మరోపక్క వరుసగా ఇటీవల జరిగిన కొన్ని రాష్ట్రాల ఎన్నికలలో బిజెపి గెలవడంతో బెంగాల్ లో కూడా జరగబోయే ఎన్నికల్లో గెలవటానికి అనేక వ్యూహాలు వేస్తూ ఉంది.

ఇటువంటి తరుణంలో నేతాజీ 125వ జయంతి దినోత్సవం సందర్భంగా కోలకత్తా సిటీ లో బుధవారం నాడు మమతా బెనర్జీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నేతాజీని దేశ నాయక్ గా రవీంద్రనాథ్ ఠాగూర్ సంపాదించారని పేర్కొన్నారు.

దేశంలో బ్రిటిష్ విభజించు - పాలించు విధానానికి వ్యతిరేకంగా ఆయన పోరాటం చేయడం జరిగింది అని ఆమె పేర్కొన్నారు.అంతే కాకుండా దేశానికి నాలుగు రొటేటింగ్ రాజధానులు ఉండాలని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Advertisement

అప్పట్లో బ్రిటిష్ వారు కోల్‌కతాను రాజధానిగా చేసుకుని పరిపాలించారని, అలాంటప్పుడు దేశంలో ఒక రాజధాని నగరం ఎందుకని మమతా బెనర్జీ ప్రశ్నించారు.అంతేకాకుండా నేతాజీ విగ్రహాన్ని నిర్మించడానికి రాష్ట్ర ప్రజలు అందరూ రెడీ అవ్వాలని పిలుపునిచ్చారు.

విగ్రహాలు మరియు పార్లమెంట్ కాంప్లెక్స్ అంటూ వేల కోట్లు ఖర్చు చేస్తున్నారు అంటూ పరోక్షంగా కేంద్రానికి చురకలంటించారు దిది. .

Advertisement

తాజా వార్తలు