ముక్కోటి ఏకాదశి రోజు 'అన్నం'వండకూడదు..! ఎందుకో తెలుసా.? తప్పక తెలుసుకోండి!

ధనుర్మాసంలో వచ్చే వైకుంఠ ఏకాదశిని హిందువులు ఎంతో పవిత్రమైన రోజు, ముఖ్యంగా శ్రీమహావిష్ణువుకి ఎంతో ప్రీతికరమైన రోజుగా భక్తులు భావిస్తారు, ధనుర్మాసంలో వచ్చే శుక్ల పక్ష ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అని అంటారు, సాధారణంగా ప్రతి సంవత్సరంలో 24 ఏకాదశులు ఉంటాయి, వీటిలో వైకుంఠ ఏకాదశిని అత్యంత పవిత్రమైనది భక్తులు భావిస్తారు, ఎందుకంటే మిగతా ఏకాదశులు చంద్రమానం ప్రకారం గణిస్తే వాటికి భిన్నంగా సౌరమానం ప్రకారం దీన్ని గణిస్తారు.

సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశినే ముక్కోటి ఏకాదశి అంటారు.

సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశినే ముక్కోటి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశి అని అంటారు.ఈ ఏకాదశి రేపు అనగా డిసెంబర్ 19 బుధవారం.

అసలు ఈ రోజుకు ఎందుకు అంత ప్రాధాన్యం .ముక్కోటి ఏకాదశి రోజు అన్నం ముట్టకూడదు అంటారు.దాని వెనుక ఉన్న కథ ఏంటో తెలుసా.?

ముర అనే రాక్షసుడు అన్నం రూపంలో ఉంటాడని ఒక విశ్వాసం అయితే, ఇంకొక కథ ప్రకారం బ్రహ్మ తలనుంచి ఒక స్వేద బిందువు నేలమీదపడి వెంటనే రాక్షస రూపం దాల్చింది.‘‘ఓ బ్రహ్మదేవ, నాకు నివాస స్థానం చూపించు’’ అని ఆ రాక్షస రూపం ప్రార్థించింది.ఏకాదశినాడు మానవులు భుజించే వరి అన్నంలో ప్రవేశించి తద్వారా వారి ఉదరాల్లో స్థావరం ఏర్పర్చుకోమని బ్రహ్మ ఆ రాక్షస రూపానికి వరం ఇచ్చాడు.

Advertisement

అందుకే ఈ రోజు శ్రీ మహావిష్ణువును షోడ శోపచారాలతో ఆరాధించి, చాలామంది ఉపవాసం చేస్తారు.

వైకుంఠ ఏకాదశి సాదారణంగా మార్గశిర పుష్యమాసాల్లో వస్తుంది.రావణుని బాధలు తాళలేక దేవతలు.బ్రహ్మను వెంట బెట్టకుని వైకుంఠానికి చేరారు.

హరి వాసరమైన మార్గశిర శక్ల ఏకాదశినాడు శ్రీహరిని ప్రార్థించి, తమ బాధను విన్న వించుకున్నారు.ఈ సందర్భంగా శ్రీమహా విష్ణువు బ్రహ్మాదులకు దర్శన మిచ్చి వారి కోరికను నెరవేర్చారు.

దేవతల బాధా నివారణానికి ఈ ఏకాదశియే మార్గం చూపింది.

అమెరికన్ వర్సిటీలలో ఇజ్రాయెల్ వ్యతిరేక నిరసనలు .. అన్నింటికీ బైడెనే కారణం : డొనాల్డ్ ట్రంప్

Advertisement

తాజా వార్తలు