ఒక్క స్పూన్ టీ పోడితో జుట్టును చేసుకోండి డబుల్..!

సాధారణంగా కొందరు జుట్టు చాలా పల్చగా ఉంటుంది.వీరికి ఎటువంటి హెయిర్ స్టైల్స్( Hairstyles ) సెట్ కావు.

ఈ క్రమంలోనే జుట్టును ఒత్తుగా మార్చుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు.ఖరీదైన హెయిర్ ఉత్పత్తులను వాడుతుంటారు.

అయితే మీకు తెలుసా.మన వంటింట్లో ఉండే టీ పొడి జుట్టును ఒత్తుగా మారుస్తుందని.

అవును, ఒక్క స్పూన్ టీ పొడి( Tea powder ) తో ఇప్పుడు చెప్పబోయే విధంగా చేశారంటే మీ జుట్టు డబుల్ అవడం ఖాయం.అందుకోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒక గ్లాసు వాటర్ పోసుకోవాలి.

Advertisement
Make Your Hair Double With Just One Teaspoon Of Tea Powder! Tea Powder, Tea Powd

వాటర్ బాగా బాయిల్ అయ్యాక వన్ టేబుల్ స్పూన్ టీ పొడి వేసుకోవాలి.అలాగే వన్ టేబుల్ స్పూన్ మెంతులు( fenugreek ), రెండు మందారం పువ్వులు వేసి చిన్న మంటపై దాదాపు పదినిమిషాల పాటు ఉడికించాలి.

ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని స్టైనర్ సహాయంతో వాటర్ ను ఫిల్టర్ చేసుకోవాలి.గోరువెచ్చగా అయ్యాక ఈ వాటర్ లో వన్ టేబుల్ స్పూన్ విటమిన్ ఈ ఆయిల్( Vitamin E oil ) వేసి బాగా మిక్స్ చేస్తే మంచి హెయిర్ టానిక్ రెడీ అవుతుంది.

Make Your Hair Double With Just One Teaspoon Of Tea Powder Tea Powder, Tea Powd

ఒక స్ప్రే బాటిల్ లో ఈ టానిక్ ను నింపుకొని స్కాల్ప్ తో పాటు జుట్టుకు ఒకటికి రెండుసార్లు స్ప్రే చేసుకుని మసాజ్ చేసుకోవాలి.గంట అనడం తేలికపాటి షాంపూను ఉపయోగించి శుభ్రంగా హెయిర్ వాష్ చేసుకోవాలి.వారానికి ఒకసారి ఈ టానిక్ ను వాడితే చాలా ప్రయోజనాలు పొందుతారు.

టీ పొడిలో ఉండే కెఫిన్‌ హెయిర్ ఫాలికల్స్‌ను స్టిమ్యులేట్ చేసి కొత్త జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.ప‌ల్చ‌టి జుట్టును కొన్ని వారాల్లోనే ఒత్తుగా మారుస్తుంది.

Make Your Hair Double With Just One Teaspoon Of Tea Powder Tea Powder, Tea Powd
చరణ్ బుచ్చిబాబు కాంబో మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయిందా.. ఆ తేదీన రిలీజ్ కానుందా?
చిల్లర కోసం ఓవర్‌ టైమ్‌ వర్క్ చేస్తున్నారా? అయితే గుండెకు చిల్లు పడినట్టే!

టీ పొడిలోని యాంటీఆక్సిడెంట్లు, టానిన్లు జుట్టు రాలడానికి అడ్డుక‌ట్ట వేస్తాయి.టీ పొడిలో యాంటీ-ఫంగల్ మరియు యాంటీ-బాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి.ఇవి చుండ్రును సంపూర్ణంగా నివారిస్తాయి.

Advertisement

అలాగే మెంతులు, మందారం పువ్వులు కూడా జుట్టు ఆరోగ్యాన్ని పోషిస్తాయి.జుట్టు ఒత్తుగా, దృఢంగా పెరిగేలా ప్రోత్స‌హిస్తాయి.

కాబ‌ట్టి, ఒత్తైన జుట్టును కోరుకునేవారు త‌ప్ప‌కుండా ఇప్పుడు చెప్పుకున్న న్యాచుర‌ల్ టానిక్ ను ప్ర‌య‌త్నించండి.

తాజా వార్తలు