నాగార్జునతో మల్టీస్టారర్.. నేను రెడీ అంటున్న మహేష్..!

కింగ్ నాగార్జున సూపర్ స్టార్ మహేష్ మల్టీస్టారర్ రాబోతుందా.వాళ్లిద్దరు కలిసి ఓ సినిమా చేస్తున్నారా అంటే అవుననే చెప్పొచ్చు.

నాగ్ నటించిన ది ఘోస్ట్ సినిమా టీజర్ ని మహేష్ రిలీజ్ చేశారు.దానికి థ్యాంక్స్ చెబుతూ కృష్ణ గారితో వారసుడు చేసి 29 ఏళ్లు అవుతుంది.

మళ్లీ మన ఇద్దరి కాంబోలో సినిమా వస్తే బాగుంటుందని అన్నారు.అయితే దానికి మహేష్ కూడా తప్పకుండా అన్నట్టు రిప్లై ఇచ్చారు.

సో ఈ లెక్కన మహేష్, నాగ్ కలిసి నటించేందుకు రెడీ.సరైన కథతో వస్తే ఆ మల్టీస్టారర్ మూవీ ఫిక్స్ అయినట్టే.

Advertisement

వెంకటేష్ తర్వాత మల్టీస్టారర్ సినిమాలని ఎంకరేజ్ చేసే హీరో నాగార్జుననే.ఆయన కూడా పాత్ర బాగుంటే చాలు ఇమేజ్ ని పక్కన పెట్టి చేస్తారు.

సో మహేష్, నాగ్ కాంబో సినిమా త్వరలోనే ఎక్స్ పెక్ట్ చేయొచ్చు.అయితే ఈ కాంబో అని చర్చలోకి రాగానే ఫ్యాన్స్ అంతా ఈ కాంబో డైరక్టర్ త్రివిక్రం కానీ కొరటాల శివ కానీ అయితే బాగుంటుందని అంచనా వేస్తున్నారు.

మొత్తానికి ఇద్దరు సూపర్ స్టార్స్ కలిసి నటిస్తే స్క్రీన్ మీద కన్నుల పండుగే అని చెప్పొచ్చు.

చాలా ఏళ్ళ గ్యాప్ తీసుకొని రిపీట్ అయిన హీరో-హీరోయిన్ల కాంబినేషన్లు ఏంటో తెలుసా ?
Advertisement