బ్రేకింగ్ : బ్రహ్మోత్సవం లో మహేష్ కూతురు ?

మహేష్ బాబు - శ్రీకాంత్ అడ్డాలా కాంబినేషన్ లో వస్తున్న బ్రహ్మోత్సవం సినిమా మీద ఫాన్స్ కి విపరీతమైన హైప్ ఉంది.దానికి కారణం లేకపోలేదు.

ఇది వరకు వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా ఫామిలీ ఆడియన్స్ లో మహేష్ స్థాయిని పెంచడమే దీనికి ప్రధాన కారణం.అయితే మహేష్ అభిమానులకి మరొక సూపర్ ఆఫర్ ఇస్తున్నాడు మహేష్ బాబు.

నేనొక్కడినే సినిమా లో తన కొడుకు గౌతం తో అరంగేట్రం చేయించిన మహేష్ ఈ సినిమా లో కూతురు సితారని పరిచయం చేయాలని మహేష్ బావిస్తున్నట్లు మరి ఎలా బయటకు వచ్చిందో ఓ ఫీలర్ వచ్చింది.మహేష్ కు వున్న ఫ్యాన్ బేస్ రీత్యా ఈ వార్త చకచకా పాకిపోయింది.

మరి నిజమో కాదో క్లారిటీ ఇవ్వాల్సింది మహేష్ మాత్రమే.వేసవి విడుదల కోసం బ్రహ్మోత్సవం చకచకా ముస్తాబు అవుతోంది.

Advertisement
మలయాళం సినిమా రీమేక్ అంటే హిట్ కొట్టినట్టేనా ? తెలుగు లో రైటర్స్ ఎక్కడ ..?
Advertisement

తాజా వార్తలు