మహేష్ బాబు బర్త్ డే కూడా పోయింది...రాజమౌళి అప్డేట్ ఇచ్చేది అప్పుడేనా..?

రాజమౌళి మహేష్ బాబు( Rajamouli, Mahesh babu ) కాంబినేషన్ లో వచ్చే సినిమా మీద రోజుకొక న్యూస్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది.

అయితే ఆగస్టు 15వ తేదీన ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇవ్వడానికి రాజమౌళి రంగం సిద్ధం చేస్తున్నట్టుగా సమాచారం అయితే అందుతుంది.

మరి తను అనుకున్నట్టుగానే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొత్తాన్ని పూర్తి చేశాడు.కాబట్టి ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది.

మరి ఈ సినిమా కోసం అటు మహేష్ బాబు అభిమానులైతే చాలా ఈగర్ గా ఎదురుచూస్తున్నారు.రీసెంట్ గా మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా రాజమౌళి ఏదైనా సర్ప్రైజ్ ఇస్తాడేమో అని అందరూ అనుకున్నారు.కానీ అందరి ఆశలను తలకిందులు చేస్తూ రాజమౌళి ఎలాంటి అప్డేట్ ఇవ్వక పోవడం తో మహేష్ బాబు అభిమానులు చాలా వరకు నిరుత్సాహపడుతున్నారనే చెప్పాలి.

ఇక ఆగస్టు 15వ తేదీన ఈ సినిమాకు సంబంధించిన అనౌన్స్ మెంట్ వస్తుందా లేదా రాజమౌళి( Rajamouli ) ఏం చేస్తున్నాడు అనే విషయం మీద అభిమానులు చాలా వరకు సీరియస్ అవుతున్నారు.

Advertisement

ఏది ఏమైనా కూడా మహేష్ బాబు ఈ సినిమాతో భారీ సక్సెస్ ని సాధిస్తాడనే ఒక నమ్మకం అయితే ప్రేక్షకుడిలో ఉంది.కాబట్టి రాజమౌళి ఏం చేసినా కూడా చూస్తూ ఊరుకుంటున్నారు.ఇక దాంతో పాటుగా మహేష్ బాబు ఈ సినిమాలో చాలా డిఫరెంట్ లుక్ లో కూడా కనిపించబోతున్నారట.

ఇక దానికోసమే రాజమౌళి మహేష్ బాబు ది స్పెషల్ కేర్ తీసుకొని మరి ఆయన లుక్ ను డిజైన్ చేయించినట్టుగా కూడా తెలుస్తుంది.చూడాలి మరి ఈ సినిమాతో వీళ్ళిద్దరూ ఎలాంటి సక్సెస్ ని సాధిస్తారు అనేది.

Advertisement

తాజా వార్తలు