'సర్కారు' సెకండ్ షెడ్యూల్ లేటెస్ట్ అప్డేట్ !

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరూ సినిమాతో సూపర్ హిట్ కొట్టి అదే జోష్ లో సినిమా స్టార్ట్ చేసాడు.

ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వం లో సర్కారు వారి పాట సినిమా చేస్తున్నాడు.

ఈ సినిమా ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ దుబాయ్ లో జరిగింది.ఈ షెడ్యూల్ లో కొన్ని కీలక సన్నివేశాలను డైరెక్టర్ తెరకెక్కించాడు.

అయితే సెకండ్ షెడ్యూల్ కూడా దుబాయ్ లోనే జరుగుతుందని ముందుగా ప్రకటించారు.కానీ కరోనా కారణంగా దుబాయ్ లో జరగాల్సిన షూటింగ్ హైదరాబాద్ కు షిఫ్ట్ చేసారు.

అలా హైదరాబాద్ లో ప్రారంభం అయినా సెకండ్ షెడ్యూల్ మళ్ళీ కొద్దీ రోజులకే కరోనా కారణంగా వాయిదా పడింది.తాజాగా ఈ సినిమా షూట్ పై ఒక అప్డేట్ బయటకు వచ్చింది.

Advertisement
Mahesh Babu Sarkaru Vaari Paata Second Schedule Latest Update, Mahesh Babu, Sark

ఇప్పుడిప్పుడే కరోనా తగ్గుతున్న సమయంలో మళ్ళీ త్వరలోనే షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నారని లేటెస్ట్ సమాచారం.జులై మొదటి వారం నుండి ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేయాలనీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది.

అంతేకాదు ఈ షూటింగ్ ఒక్కసారి స్టార్ట్ అయ్యిందంటే మళ్ళీ అది పూర్తయ్యావరకు బ్రేక్ లేకుండా కంటిన్యూ చేస్తారని టాక్ వినిపిస్తుంది.ముందుగా ప్రకటించిన డేట్ కే ఈ సినిమాను రిలీజ్ చెయ్యాలని పట్టుదలతో ఉన్నారట చిత్ర యూనిట్.

మొత్తానికి ఈ సినిమా షూటింగ్ తొందరలోనే స్టార్ట్ కాబోతుంది.

Mahesh Babu Sarkaru Vaari Paata Second Schedule Latest Update, Mahesh Babu, Sark

ఇది ఇలా ఉంటే ఈ సినిమా లో హీరోయిన్ గా కీర్తి సురేష్ నటిస్తుంది.బాలీవుడ్ హీరో అనిల్ కపూర్ ఇందులో విలన్ గా నటిస్తున్నాడు.ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

న్యూస్ రౌండప్ టాప్ 20

తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.ఈ సినిమా ను వచ్చే సంవత్సరం 2022 సంక్రాంతికి విడుదల చేయబోతున్నారు.

Advertisement

తాజా వార్తలు