ట్విట్టర్ లో సరికొత్త రికార్డ్ సృష్టించిన మహేష్ బాబు?

టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ఎంత చెప్పినా తక్కువే.

కృష్ణ వారసుడుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న మహేష్ బాబు కేవలం హీరోగా మాత్రమే కాకుండా సమాజ సేవా కార్యక్రమాలను చేస్తూ ఎంతో పేరు ప్రఖ్యాతలు పొందారు.

మహేష్ బాబు ఫౌండేషన్ ద్వారా ఈయన ఇప్పటికే ఎన్నో సేవా కార్యక్రమాలను చేశారు.ఇలా హీరోగా మానవతావాదిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు పొందిన మహేష్ బాబుకు అభిమానులు రోజురోజుకు పెరుగుతున్నారు.

ఇకపోతే మహేష్ బాబు సినిమాల పరంగా ఎంతో బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో కూడా అంతే యాక్టివ్ గా ఉంటారు.ఈయన ముఖ్యంగా ట్విట్టర్ ద్వారా తన సినిమాలకు సంబంధించిన విషయాలపై స్పందించడమే కాకుండా ఇతర హీరోల సినిమాలు విడుదలైన లేదంటే ఇండస్ట్రీకి సంబంధించిన అన్ని విషయాల గురించి కూడా ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ ఉంటారు.

ఇలా అన్ని విషయాలను అభిమానులతో పంచుకునే మహేష్ బాబు ట్విట్టర్లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు.

Mahesh Babu Reached 13 Million Followers On Twitter Details, Mahesh Babu ,twitte
Advertisement
Mahesh Babu Reached 13 Million Followers On Twitter Details, Mahesh Babu ,Twitte

ఈ క్రమంలోనే ట్విట్టర్ వేదికగా ఈయన అద్భుతమైన రికార్డు సృష్టించారని చెప్పాలి.తాజాగా మహేష్ బాబు ట్విట్టర్ లో ఏకంగా 13 మిలియన్ ఫాలోవర్స్ ని సంపాదించుకున్నారు.ఈ క్రమంలోనే ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో మహేష్ బాబు అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఈయనకు ఇంస్టాగ్రామ్ లో ఫాలోవర్స్ తక్కువగా ఉన్నప్పటికీ ట్విటర్లో మాత్రం పెద్ద ఎత్తున అభిమానులను సొంతం చేసుకున్నారు.ఇక మహేష్ బాబు సినిమాల విషయానికి వస్తే సర్కారు వారి పాట సినిమాతో హిట్ అందుకున్న మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు