మహేష్ బాబు కెరీర్ లో ఆగిపోయిన సినిమాలు ఎన్ని ఉన్నాయో తెలుసా?

సినిమా పరిశ్రమలో నిత్యం ఎన్నో సినిమాలు ప్రారంభం అవుతాయి.అయితే స్టార్ట్ అయిన ప్రతి సినిమా పూర్తి కావాలనే రూల్ ఏమీ లేదు.

కొన్ని షూటింగ్ మొదలై ఆగిపోయిన సినిమాలున్నాయి.మరికొన్ని సగం షూటింగ్ కంప్లీట్ చేసుకున్నాక నిలిచిపొయినవి ఉన్నాయి.

మరికొన్ని షూటింగ్ పూర్తి చేసుకున్నాక కూడా ఆగిపోయిన సినిమాలున్నాయి.ఇలాంటి అనుభవాలు తెలుగు సినిమా పరిశ్రమలో చాలా మంది హీరోలు ఎదుర్కొన్నారు.

సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలు కూడా ఇందులో ఉన్నాయి.ఘనంగా ప్రారంభమై మధ్యలో ఆగిపోయిన ఆయన సినిమాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

సైన్యం

Mahesh Babu Movies Which Are Halted In Middle , Vamsi Paidipally, Trivikram, Pur
Advertisement
Mahesh Babu Movies Which Are Halted In Middle , Vamsi Paidipally, Trivikram, Pur

మహేష్ బాబుతో కలిసి అర్జున్ సినిమా తెరకెక్కించి సక్సెస్ కొట్టాడు గుణ శేఖర్.ఆ తర్వాత వారి కాంబినేషన్ లోనే సైన్యం సినిమా తీయడానికి నిర్మాత ఎంఎస్ రాజు ప్రయత్నించాడు.ఈ సినిమా పోకిరి కంటే ముందే ప్రారంభం కావాలి.

అయితే ఈలోగా పోకిరి విడుదలై.ఇండస్ట్రీ హిట్ కొట్టింది.

దాంతో సైన్యం మూవీ ఆగిపోయింది.అటు సైనికుడు సినిమా కూడా దారుణంగా ఫ్లాప్ కావడంతో ఈ సినిమా నిలిచిపోయింది.

వరుడు

Mahesh Babu Movies Which Are Halted In Middle , Vamsi Paidipally, Trivikram, Pur

మహేష్ బాబు కోసం వరుడు అనే టైటిల్ ను ఖరారు చేశారు.రిజిస్టర్ కూడా చేశారు.కానీ ఎందుకో ఈ సినిమా ముందుకు సాగలేదు.

నెలలో రెండుసార్లు ఈ రెమెడీని పాటిస్తే 60 లోనూ తెల్ల జుట్టు దరిచేరదు!

ఖలేజా సినిమా ఆలస్యం కావడం మూలంగానే ఈ సినిమా నిలిచిపోయినట్లు చెప్తారు.దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో మహేష్ బాబు నటిస్తున్నట్లు ప్రకటించినా.

Advertisement

ఆ సినిమా మొదలు కాలేదు.

మహేష్, కరీనా మూవీ

రూ.40 కోట్లతో మహేష్ బాబు, కరీనా కపూర్ సినిమా అనుకున్నారు.అదే సమయంలో మహేష్ బాబు దూకుడు సినిమా చేశాడు.

దాని కారణంగా ఈ సినిమా పక్కకు పోయింది.

మణిరత్నం మూవీ

మహేష్ బాబు, మణిరత్నం కాంబినేషన్ లో ఓ సినిమా చేస్తున్నట్లు ప్రకటన వచ్చింది.అయితే ఆ తర్వాత ఏకారణమో తెలియదు కానీ సినిమా ఆగిపోయింది.

పూరీ మూవీ

మహేష్ బాబు, పూరీ జగన్నాథ్ కలిసి జనగనమణ అని సినిమా చేయాలి అనుకున్నారు.కానీ ఈ సినిమా 2016 నుంచి వాయిదా పడుతూనే ఉంది.

త్రివిక్రమ్ మూవీ

త్రివిక్రమ్ డైరెక్షన్ లో హరే రామ హరే కృష్ణ సినిమా చేయాలి అనుకున్నాడు మహేష్.కానీ ఇప్పటికీ ఆ సినిమా ఫైనల్ కాలేదు.

వంశీ పైడిపల్లి మూవీ

మహర్షి తర్వాత వంశీ పైడిపల్లి మహేష్ తో మరో సినిమా చేయాలి అనుకున్నాడు.కానీ కథలో మార్పుల కారణంగా ఈ సినిమా ఆగిపోయింది.డైరెక్షన్ లో ఒక సినిమా వస్తుందని అనుకున్నప్పటికీ కథలో మార్పులు చేయమనడంతో ఆగిపోయింది.

ప్రస్తుతం మహేష్ బాబు.పరుశురామ్ దర్శకత్వంలో సర్కారువారి పాట అనే సినిమా చేస్తున్నాడు.

తాజా వార్తలు