క్లాస్‌లో మాస్ అంటోన్న మహేష్.. రెండు కళ్లు చాలవట!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తన కొత్త చిత్రం ‘సర్కారు వారి పాట’ షూటింగ్‌ను ప్రారంభించేందుకు రెడీ అవుతున్నాడు.

ఇప్పటికే ఈ సినిమాను అఫీషియల్‌గా అనౌన్స్ చేసిన చిత్రం యూనిట్, కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్‌ను మొదలుపెట్టలేకపోయారు.

కాగా ప్రస్తుతం సినిమా షూటింగ్‌లకు అనుమతి లభించడంతో, సర్కారు వారి పాట కూడా షూటింగ్ మొదలుపెట్టేందుకు రెడీ అవుతున్నాడు.ఈ సినిమా కథ పూర్తిగా ఆర్థిక నేరాల చుట్టూ తిరుగుతుందని చిత్ర యూనిట్ ఇప్పటికే పేర్కొంది.

Mahesh Babu Mass Look To Be Highlight In Sarkaru Vaari Paata, Mahesh Babu, Sarka

కాగా ఈ సినిమాలో మహేష్ ఓ బ్యాంక్ మేనేజర్ కొడుకుగా చాలా అల్ట్రా స్టైలిష్ లుక్‌లో మనకు కనిపించనున్నాడు.ఇప్పటికే మహేష్ ప్రీలుక్ పోస్టర్ ఈ సినిమాపై అదిరిపోయే అంచనాలను క్రియేట్ చేసింది.

కాగా ఈ సినిమాలో మహేష్ బాబు రెండు విభిన్న లుక్స్‌లో కనిపిస్తాడని చిత్ర యూనిట్ అంటోంది.అందులో భాగంగా పక్కా మాస్ లుక్‌లో మహేష్ కనిపించే తీరు ప్రేక్షకులను మెస్మరైజ్ చేయడం ఖాయమని తెలుస్తోంది.

Advertisement

ఇలా రెండు లుక్స్‌లో మహేష్‌ను చూసేందుకు రెండు కళ్లు చాలవని చిత్ర యూనిట్ అంటోంది.మొత్తానికి ఈ సినిమాలో అల్ట్రా స్టైలిష్ లుక్‌లోని మహేష్‌ను ఒక్కసారిగా మాస్ లుక్‌లో చూడటంతో ప్రేక్షకులు ఖచ్చితంగా అవాక్కవుతారని చిత్ర యూనిట్ అంటోంది.

ఇక ఈ సినిమాలో మహేష్ సరసన అందాల భామ కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమా షూటింగ్‌ను అమెరికాలో జరుపుకునేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.

ఒక్కసారి వీసా పనులు పూర్తవ్వగానే సర్కారు వారి పాట చిత్ర యూనిట్ అమెరికా వెళ్లేందుకు సిద్ధమవుతారు.మరి ఈ సినిమాలో మహేష్ లుక్స్ ఎలా ఉంటాయో తెలియాలంటే మాత్రం సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.

అధిక బరువుతో వర్రీ వద్దు.. నిత్యం ఈ హెర్బల్ వాటర్ ను తాగితే నెల రోజుల్లో సన్నబడతారు!
Advertisement

తాజా వార్తలు