11కు చేరిన మహేష్‌ బాబు సినిమాల సంఖ్య.. టాలీవుడ్‌ లో నెం.1

తెలుగు లో ప్రతి ఏడాది ఎన్నో సినిమా లు విడుదల అవుతూ ఉంటాయి.

ఇక్కడ విడుదల అయిన సినిమా లను ఓవర్సీస్ ప్రేక్షకులు కూడా అమితంగా ఇష్టపడుతున్నారు.

ఓవర్సీస్ లో తెలుగు సినిమా లకు ఈమద్య కాలంలో మంచి గుర్తింపు మరియు వసూళ్లు దక్కతున్నాయి.ఓవర్సీస్ మార్కెట్‌ అనగానే మహేష్ బాబు గుర్తుకు వస్తాడు.

మహేష్ బాబు హీరోగా నటించిన సినిమాలు ఎక్కువగా అమెరికాలో ఆడుతున్నాయి.అమెరికాలో మొదటి మిలియన్ మార్క్‌ దక్కించుకున్నది మహేష్ బాబు సినిమా.

రాజమౌళి సినిమాలన్నీ కూడా అక్కడ మంచి వసూళ్లు నమోదు చేస్తున్నాయి.అయినా కూడా మహేష్ బాబు తర్వాతే అక్కడ రాజమౌళి అనడంలో ఎలాంటి సందేహం లేదు.

Advertisement

మహేష్ బాబు ఏకంగా 11 సినిమా లతో అమెరికా లో మిలియన్ మార్క్ ను చేరాడు.సర్కారు వారి పాట సినిమా కూడా ప్రీమియర్‌ లతో కలిపి మొదటి రోజే మిలియన్ డాలర్లను వసూళ్లు చేసింది.

మూడు మిలియన్ డాలర్లను వసూళ్లు చేస్తుందనే నమ్మకం ను ప్రతి ఒక్కరు వ్యక్తం చేస్తున్నారు.

ఓవర్సీస్ లో సర్కారు వారి పాట సినిమా మిలియన్ డాలర్లను క్రాస్ చేయడంతో మహేష్ బాబు మిలియన్ డాలర్ల సినిమాల సంఖ్య 11 కి చేరింది.మహేష్ బాబు నెం.1 గా ఉండగా ఆయన తర్వాత స్థానంలో ఎన్టీఆర్ ఏడు సినిమా ల తో మిలియన్ మార్క్ ను టచ్ చేశాడు.ఇక ఆరు సినిమాలతో పవన్ కళ్యాన్ నెం.3 లో ఉన్నాడు.

నాని కూడా ఆరు సినిమాలతో మిలియన్ మార్క్ ను చేరుకోగా అల్లు అర్జున్‌ 5 , ప్రభాస్ 4 సినిమా లతో అక్కడ మిలియన్ డాలర్లను వసూళ్లు చేశారు. ఈ జాబితాలో చరణ్ మరియు ఇతర స్టార్ హీరోలు చాలా కింద వరుసలో ఉన్నారు.ఈమద్య విడుదల అయిన సినిమాలు దాదాపు అన్ని కూడా ఓవర్సీస్ లో మిలియన్ డాలర్లను వసూళ్లు చేస్తున్నాయి.

విజయవాడలో బిజినెస్ అండ్ టూరిజం వీసాపై సదస్సు
హీరో తేజ సజ్జాకు పాదాభివందనం చేసిన పెద్దాయన.. అసలేం జరిగిందంటే?

కనుక ముందు ముందు నెంబర్స్ మారే అవకాశాలు ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు