SSMB28 : ఆ మూడు నెలల్లోనే మొత్తం పూర్తి కానుందా?

సూపర్ స్టార్‌ మహేష్ బాబు( Mahesh Babu ) హీరోగా త్రివిక్రమ్‌ ( Trivikram ) దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి.అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా దర్శకుడు త్రివిక్రమ్‌ సినిమా ను రూపొందిస్తున్నాడు.

 Mahesh Babu And Trivikram Movie Ssmb28 Update-TeluguStop.com

ఏప్రిల్‌ నెలలో సినిమా కొన్ని కారణాల వల్ల షూటింగ్‌ జరలేదు.మే నెలలో దాదాపుగా 20 రోజుల డేట్లు కేటాయించిన మహేష్ బాబు అనూహ్యంగా విదేశీ పర్యటనకు వెళ్లడంతో అంతా కూడా అవాక్కయ్యారు.

అసలు ఏం జరిగింది అంటూ కామెంట్స్ వచ్చాయి.

Telugu Rajamouli, Pooja Hegde, Mahesh Babu, Maheshbabu, Ssmb, Trivikram-Movie

హీరోగా మహేష్ బాబుకు ఇది 28వ సినిమా అనే విషయం తెల్సిందే.అంతే కాకుండా అతడు మరియు ఖలేజా సినిమాల తర్వాత వీరిద్దరి కాంబోలో రూపొందుతున్న సినిమా ఇదే అవ్వడంతో అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి.ఈ సినిమా షూటింగ్ ఎప్పుడెప్పుడు పూర్తి అవుతుందా అంటూ అభిమానులు వెయిట్‌ చేస్తున్నారు.

ఇదే సమయంలో మహేష్‌ బాబు యొక్క డేట్ల కోసం త్రివిక్రమ్ వెయిట్‌ చేస్తున్నాడు అంటూ అందరికి తెల్సిందే.మహేష్ బాబు జూన్ నెల నుండి వరుసగా మూడు నెలల పాటు షూటింగ్ కు డేట్లు కేటాయించబోతున్నట్లుగా తెలుస్తోంది.

Telugu Rajamouli, Pooja Hegde, Mahesh Babu, Maheshbabu, Ssmb, Trivikram-Movie

మూడు నెలల షూటింగ్ తో సినిమా పూర్తి అయ్యే అవకాశాలు ఉన్నాయి.ఆగస్టు వరకు షూటింగ్‌ పూర్తి చేస్తే వచ్చే ఏడాది జనవరి లో సినిమా విడుదలకు ఎలాంటి ఇబ్బంది ఉండదు.అంతే కాకుండా ఈ ఏడాది చివరి నుండి రాజమౌళి ( Rajamouli ) యొక్క సినిమా వర్క్ లో కూడా మహేష్ బాబు బిజీ అయ్యే అవకాశాలు ఉన్నాయి.అదే జరిగితే వచ్చే ఏడాదిలో త్రివిక్రమ్‌ సినిమా పూర్తి అవ్వగానే షూటింగ్‌ కూడా మొదలు పెట్టేందుకు రాజమౌళి సిద్ధం అయ్యే అవకాశాలు ఉన్నాయి అంటూ సినీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మహేష్ బాబు యొక్క విభిన్నమైన లుక్ ను ఈ సినిమా లో చూడబోతున్నట్లుగా ఫ్యాన్స్ నమ్మకంగా ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube