గల్లీ బాయ్‌తో మహేష్.. అవాక్కవుతున్న ఫ్యాన్స్

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాల్లో ఎంత బిజీగా ఉంటాడో అందరికీ తెలసిందే.

వరుసబెట్టి సినిమాలు చేస్తూనే, పలు కంపెనీల యాడ్‌లతో కూడా చాలా బిజీగా ఉంటాడు.

అయితే టాలీవుడ్‌ స్టార్ హీరోల్లో మహేష్ చేసే యాడ్‌ల సంఖ్య అందరికంటే ఎక్కువ.మరి మహేష్ వాటికి ఇచ్చే ప్రమోషన్స్ ఆ రేంజ్‌లో ఉండబట్టే ఆయన్ను తమ యాడ్‌లో చేయాల్సిందిగా పలు కంపెనీలు క్యూ కడుతుంటాయి.

Mahesh Babu Ad With Ranveer Singh-గల్లీ బాయ్‌తో మహ�

అయితే మరో స్టార్ హీరోతో కలిసి మహేష్ ఓ యాడ్‌లో కనిపించనున్నాడు.ప్రముఖ కోలా కంపెనీ యాడ్‌లో బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్‌తో కలిసి మహేష్ నటించనున్నాడు.

దీనికి సంబంధించిన షూట్ కోసం ఆయన మంగళవారం ముంబై ప్రయాణమయ్యాడు.హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో మహేష్‌ ఇవాళ దర్శనమివ్వడంతో ఈ మేరకు సమాచారం పక్కా అని మీడియా వర్గాలు అంటున్నాయి.

Advertisement

ఇలా సినిమాలతో పాటు యాడ్‌లలో నటిస్తూ రెండు చేతులా సంపాదిస్తు్న్న హీరోల్లో మహేష్ టాప్ పొజిషన్‌లో ఉంటాడు.బాలీవుడ్‌లో రణ్‌వీర్ సింగ్‌ది కూడా ఇదే తంతు.

మొత్తానికి నార్, సౌత్‌లకు చెందిన ఇద్దరు స్టార్ హీరోలు చేయబోయే ఆ యాడ్ ఎలా ఉంటుందా అని అభిమానుల్లో ఆసక్తి అప్పుడే మొదలైంది.

Advertisement

తాజా వార్తలు