ఫ్యాన్ ఇండియా కల్చర్ వచ్చిన తరువాత మన స్టార్ హీరోలందరూ అన్ని భాషల్లోకి తమ సినిమాను డబ్బింగ్ చేస్తూ బాగానే పాపాలారిటీ సంపాదించుకున్నారు.అంతే కాదు నేషనల్ వైడ్ గా క్రేజ్ పెంచుకొని రెమ్యునరేషన్ కూడా పెంచుకున్నారు.
అయితే ఇక్కడే వచ్చింది అసలు సమస్య.ఒక్కసారి ఫెమ్ వచ్చాక అందరు దాన్నే క్యాష్ చేసుకునే పనిలో పడతారు.
అందుకే బాలీవుడ్ లో చాల మంది డైరెక్టర్స్ మన తెలుగు హీరోల వెనక పడుతున్నారు.అయినా కూడా మేము టాలీవుడ్ ని కాదని బాలీవుడ్ కి వచ్చే ప్రసక్తే లేదు అంటూ తేల్చి చెప్పుతున్నారు ఇద్దరు టాలీవుడ్ హీరోలు.

టాలీవుడ్ లో కేవలం ఆ ఇద్దరు హీరోలు మాత్రమే ఆలా చెప్తున్నారు.ఇంతకు ఆ ఇద్దరు హీరోలు ఎవరు అంటే మహేష్ బాబు మరియు అల్లు అర్జున్.( Mahesh Babu , Allu Arjun ) చాల ఏళ్లుగా మహేష్ బాబు బాలీవుడ్ ఆఫర్స్ ని రిజెక్ట్ చేస్తూనే వస్తున్నాడు.అలాగే ఇప్పుడు ఈ లిస్ట్ లో అల్లు అర్జున్ కూడా వచ్చి చేరాడు.
ఎవరు ఎన్ని సార్లు అడిగిన బన్నీ కూడా బాలీవుడ్ కి నో చెప్తున్నారు.అయితే టాలీవుడ్ నుంచి కొంత మంది హీరోలు మాత్రం లాంగ్వేజ్ కి యాక్టింగ్ కి సంబంధం లేదు అన్నట్టుగా బాలీవుడ్ లో నటిస్తున్నారు.

రామ్ చరణ్ ( Ram Charan )చాల ఏళ్ళ క్రితమే జంజీర్ సినిమా తో ఎంట్రీ ఇస్తే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ( Junior NTR )కూడా వార్ 2 సినిమాతో బాలీవుడ్ లో నేరుగా ఒక సినిమాలో నటిస్తున్నాడు.ఇక ఆది పురుష్ తో ఇప్పటికే ప్రభాస్ ( Prabhas )అదే పని చేసాడు.ఇలా మిగతా హీరోలు చాల సంతోషంగా బాలీవుడ్ కి చెక్కేస్తే మహేష్ , బన్నీ మాత్రం అందుకే ఏమాత్రం సుముఖంగా లేకపోవడం విశేషం.మరి ఈ కండిషన్ ఇప్పుడు మాత్రమేనా ముందు ముందు కూడా ఇలాగే తెలుగు సినిమాలతోనే దేశమంతా ఏలేస్తారా అని వేచి చూస్తే తెలుస్తుంది.
ఏది ఏమైనా ఎంతో మంది హీరోలతో పోలిస్తే వీరిద్దరూ మాత్రం వెరీ స్పెషల్ అంటూ బన్నీ మరియు మహేష్ ఫ్యాన్స్ సంబరాలు చేస్తుకుంటున్నారు.