ఐపీఎల్ లో మహేంద్ర సింగ్ ధోని 20వ ఓవర్లలో సరికొత్త రికార్డు.. ఎన్ని పరుగులు చేశాడంటే..?

41 ఏళ్ల మహేంద్రసింగ్ ధోని( Mahendrasingh Dhoni ) ఈ ఐపీఎల్ సీజన్లో అద్భుత ఆటను ప్రదర్శిస్తున్నాడు.టీ20 క్రికెట్లో 20వ ఓవర్లో అత్యధిక పరుగులు చేసిన రెండవ ప్రపంచ బ్యాట్స్ మెన్ గా సరికొత్త రికార్డు సృష్టించాడు.

తాజాగా జరిగిన మ్యాచ్లో పంజాబ్ ( PBKS ) చేతిలో ఓడినప్పటికీ నాలుగు బంతుల్లో రెండు సిక్సర్లతో 13 పరుగులు చేసి నాట్ అవుట్ గా తిరిగి వచ్చాడు.

దీంతో టీ 20 క్రికెట్లో( T20 Cricket ) 20వ ఓవర్ల లో 1000 పరుగులు పూర్తి చేశాడు.అయితే ఈ జాబితాలో వెస్టిండీస్ మాజీ ఆల్రౌండర్ కీరన్ పోలార్డ్ అగ్రస్థానంలో ఉన్నాడు.

ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్( MI ) తరఫున ఆడిన పోలార్డ్ పై తొలి రికార్డ్ ఉంది.చెన్నై సూపర్ కింగ్స్( CSK ) జట్టు ఐపీఎల్ లో 27వ సారి 200 పరుగులు చేసింది.

మహేంద్రసింగ్ ధోని ఐపీఎల్లో 20వ ఓవర్ల లో మొత్తం 290 బంతులు ఎదుర్కున్నాడు.ఇతని బ్యాట్ నుండి 709 పరుగులు వచ్చాయి.దీంతో ఐపీఎల్ 20వ ఓవర్లలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు.

Advertisement

కీరన్ పోలార్డ్ ఐపీఎల్ లో 20వ ఓవర్ల లో 405 పరుగులు చేసి ఈ జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు.

మహేంద్రసింగ్ ధోని 20వ ఓవర్లలో ఇప్పటివరకు 74 సిక్సర్లు, 73 ఫోర్లు బాదాడు.ఇక 20వ ఓవర్ల లో 15 సార్లు రెండు వరుస సిక్సులు బాదాడు.ఐపీఎల్ లో అయితే 59 సిక్సర్లతో మొదటి స్థానంలో ఉన్నాడు.

కీరన్ పోలార్డ్ 33 సిక్సర్లతో రెండవ స్థానంలో ఉన్నాడు.

మహేంద్ర సింగ్ బ్యాటింగ్ చేస్తున్న తీరు చూస్తే, వయసుతో సంబంధం లేకుండా యువ ఆటగాడిలాగా తన స్టైల్ లో ఇన్నింగ్స్ పూర్తి చేస్తున్నాడు.ఐపీఎల్ చరిత్రలో ఏ బ్యాట్స్ మెన్ లేని అరుదైన రికార్డులు కేవలం మహేంద్రసింగ్ ధోని పేరుపై లిఖించబడ్డాయి.

పుష్ప 2 అనుకున్న రేంజ్ లో ఆడకపోతే ఎవరికి ఎక్కువ నష్టం వస్తుంది...
Advertisement

తాజా వార్తలు