Sushant Singh Rajput : సుశాంత్ ఆత్మహత్యపై ఉప ముఖ్యమంత్రి షాకింగ్ కామెంట్స్.. ఆధారాలు దొరికాయంటూ?

బాలీవుడ్ దివంగత హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్( Sushant Singh Rajput ) గురించి మనందరికీ తెలిసిందే.సుశాంత్ 2020 జూన్ లో మరణించిన విషయం తెలిసిందే.

 Maharashtra Deputy Chief Minister Devendra Fadnavis Comments On Late Actor Sush-TeluguStop.com

ముంబైలోని నా అపార్ట్మెంట్ లో ఆత్మహత్య చేసుకొని చనిపోయారు.సుశాంత్ ఆత్మహత్య విషయంలో అనేక రకాల వార్తలు వెలుగులోకి వచ్చాయి.

అంతేకాకుండా సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం ఇప్పటికీ వీడని మిస్టరీ అని చెప్పవచ్చు ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా బాలీవుడ్ ఇండస్ట్రీకీ ఎంట్రీ ఇచ్చిన సుశాంత్ అతి తక్కువ సమయంలోనే స్టార్ డమ్ ను సంపాదించుకున్నాడు.

Telugu Bollywood, Cbi, Sushantsingh-Movie

కానీ అంతలోనే ఆత్మహత్య చేసుకోవడం అందరిని ఒక్కసారిగా షాక్ కీ గురిచేసింది.అప్పటివరకు సరదాగా కనిపించిన సుశాంత్ అంతలోనే సూసైడ్ చేసుకోవడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోయారు.కాగా సుశాంత్ మరణించి ఇప్పటికీ మూడేళ్లు అవుతున్నా ఇంకా అతని ఆత్మహత్యపై సందిగ్ధత వీడడం లేదు.

అధికారులు సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నట్లు ఆధారాలు ఉన్నాయంటున్నప్పటికీ అతని అభిమానులు, కుటుంబసభ్యులు మాత్రం ఆయన మరణంపై సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.దీంతో ఆయన మరణపై సీబీఐ విచారణ( CBI investigation ) చేపట్టింది.

మూడేళ్లుగా విచారణ జరుగుతున్నప్పటికీ ఇప్పటికీ ఎలాంటి పురోగతి కనిపించడం లేదు.

Telugu Bollywood, Cbi, Sushantsingh-Movie

తాజాగా మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్( Devendra fadnavis ) సుశాంత్ ఆత్మహత్యపై సంచలన వ్యాఖ్యలు చేశారు.పోలీసుల విచారణలో బలమైన సాక్ష్యాలు ఉన్నాయని ఆయన వెల్లడించారు.కాగా సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణంపై దేవేంద్ర ఫడ్నవిస్ మాట్లాడుతూ.

మొదట ఈ కేసులో కొందరు చెప్పిన సమాచారం మాత్రమే ఉంది.ఆ తర్వాత కొందరు తమ వద్ద బలమైన సాక్ష్యాలు ఉన్నాయని చెప్పారు.

వారి వద్ద ఉన్న ఆధారాలను పోలీసులకు సమర్పించాలని కోరాము.ప్రాథమిక సాక్ష్యాలను సేకరించాము.

వాటి విశ్వసనీయతను సీబీఐ అధికారులు పరిశీలిస్తున్నారు.ప్రస్తుతం ఈ కేసుపై దర్యాప్తు కొనసాగుతున్నందున ఇప్పుడు దీని గురించి ఇంతకంటే ఏం మాట్లాడలేను అని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube