మహా శివరాత్రి రోజు పూజ సమయంలో పాటించాల్సిన నియమాలు ..!

త్రిమూర్తులలో ఒకరు, అభిషేక ప్రియుడు అయినటువంటి ఆ పరమశివుడికి మహాశివరాత్రి అంటే ఎంతో ప్రీతికరం.

పరమేశ్వరుడు లింగాకృతిలో పొందినది శివరాత్రి రోజు కనుక శివరాత్రి రోజున స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.

పరమేశ్వరుడికి ఎంతో ముఖ్యమైన ఈ మహా శివరాత్రి రోజు భక్తిశ్రద్ధలతో స్వామివారిని పూజించిన వారికి కొంగుబంగారం అవుతుంది.వారు కోరుకున్న కోరికలు తప్పకుండా నెరవేరుతాయి.

మహా శివరాత్రి రోజు ఉపవాసాలు ఉండటం, జాగరణ చేయడం వంటివి చేస్తాము.అయితే ఆ బోలా శంకరుడుకి ఎంతో పవిత్రమైన ఈ మహా శివరాత్రి రోజు పూజ చేసే సమయంలో తెలిసి తెలియక చేసే కొన్ని పొరపాట్లు దోషాలను కలుగజేస్తాయి.

కనుక ఆ పరమ శివుడికి పూజ చేసే సమయంలో కచ్చితంగా కొన్ని నియమాలను పాటించాలి.ఆ నియమాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం.

Advertisement
Maha Shivaratri 2021 Pooja Vidhi And Rules In Telugu , Maha Sivaratri, Lard Shi

అభిషేక ప్రియుడైన ఆ పరమేశ్వరుడికి మహా శివరాత్రి రోజు కచ్చితంగా పంచామృతాలు అనగా ఆవు పేడ, ఆవు పంచకం, పాలు, పెరుగు, నెయ్యితో తప్పకుండా అభిషేకం చేయాలి.ఈ పంచామృతాలతో అభిషేకం చేస్తున్నంత సేపు ఆ పరమేశ్వరుడిని ఓం నమశ్శివాయ అనే మంత్రాన్ని పలుకుతూ ఉండాలి.

ముందుగా చందనంతో ప్రారంభించి అన్ని ఉపచారాలతో పూజించి అగ్నిలో నువ్వులు, బియ్యం,నెయ్యితో కలిపిన అన్నం వేసి పూర్ణాహుతి ఇవ్వాలి.శివుని కథలు వింటూ తెల్లవార్లు జాగరణ చేయాలి.

Maha Shivaratri 2021 Pooja Vidhi And Rules In Telugu , Maha Sivaratri, Lard Shi

కృష్ణపక్ష చతుర్దశి శివునికి ఎంతో ఇష్టమైన రోజు కనుక ప్రతినెల ఆ రోజును మాస శివరాత్రి అని పిలుస్తారు.శివరాత్రి రోజు వేకువ జామునే నిద్రలేచి తలంటు స్నానం చేసి ఆ పరమేశ్వరాలయాన్ని సందర్శించాలి.శివరాత్రి రోజు మొత్తం ఉపవాస జాగరణలు చేసి ఓం నమశ్శివాయ అంటూ స్వామి వారి సేవలో నిమగ్నం అవ్వాలి.

శివరాత్రి మరుసటి రోజు ఉత్తమ విప్రులు, శివ భక్తులకు అన్నదానం చేయాలి.ముఖ్యంగా శివుడికి పూజ చేసే సమయంలో బిల్వ దళాలు తప్పనిసరి.ఈ విధంగా పూజ చేయటం వల్ల ఆ పరమేశ్వరుని అనుగ్రహం మనపై కలుగుతుంది.

నెలలో రెండుసార్లు ఈ రెమెడీని పాటిస్తే 60 లోనూ తెల్ల జుట్టు దరిచేరదు!
Advertisement

తాజా వార్తలు