మహా సముద్రం నుండి 'హే రంభ' సాంగ్.. మాస్ లుక్ లో శర్వా !

తెలుగు ఇండస్ట్రీలో టాలెంట్ ఉన్న నటుల్లో శర్వానంద్ ఒకరు.శర్వానంద్ ఎప్పుడూ కొత్త కథలతో ప్రేక్షకులను అలరిస్తూనే ఉంటాడు.

ఈ మధ్యనే ఆయన చేసిన శ్రీకారం సినిమా విడుదల అయ్యి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.ప్రస్తుతం శర్వానంద్ ఆర్ ఎక్స్ 100 దర్శకుడు అజయ్ భూపతి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమామహాసముద్రంలో నటిస్తున్నాడు.

ఈ సినిమాను లవ్ అండ్ యాక్షన్ డ్రామాగా దర్శకుడు తెరకెక్కిస్తున్నాడు.ఆర్ఎక్స్ 100 సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న విజయ్ భూపతి ఇప్పుడు శర్వానంద్ తో మరో విజయాన్ని అందుకోవాలని ప్రయత్నిస్తున్నాడు.

ఇప్పటికే విడుదల అయిన పోస్టర్స్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచాయి.ఇందులో హీరో సిద్దార్ధ్ కూడా నటిస్తున్నాడు.

Advertisement
Maha Samudram Team Released Hey Rambha Song, Sharwanand, MahaSamudram, Siddharth

చాలా రోజుల తర్వాత సిద్దార్థ్ డైరెక్ట్ తెలుగు సినిమా చేస్తున్నాడు.

Maha Samudram Team Released Hey Rambha Song, Sharwanand, Mahasamudram, Siddharth

తాజాగా ఈ సినిమా నుండి హే రంభ సాంగ్ ను విడుదల చేసారు.ఈ సాంగ్ ను స్టార్ హీరోయిన్ రంభ కు ట్రిబ్యూట్ గా ఇస్తున్నట్టు ఎప్పుడో తెలిపారు.అయితే ఈ రోజు విడుదల అయినా ఈ సాంగ్ మాస్ ఆడియెన్స్ ను బాగా ఆకట్టుకుంది.

ఈ ఐటెం సాంగ్ లో హీరోయిన్స్ ఎవ్వరు లేకుండా కేవలం రంభ ఫ్లెక్సి లు మాత్రమే పెట్టి హీరో శర్వానంద్ మాస్ స్టెప్పులు వేసాడు.

Maha Samudram Team Released Hey Rambha Song, Sharwanand, Mahasamudram, Siddharth

ఈ పాట కూడా వినడానికి చాలా బాగుంది.ఈ సాంగ్ కు చైతన్య భరద్వాజ్ అందించిన మ్యూజిక్ బాగా సెట్టవ్వడంతో చాలా బాగా ఆకట్టుకుంటుంది.ఇందులో శర్వా కొత్త లుక్ లో మాస్ గా కనిపిస్తున్నాడు.

నెలలో రెండుసార్లు ఈ రెమెడీని పాటిస్తే 60 లోనూ తెల్ల జుట్టు దరిచేరదు!

ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధం అవుతుంది.అతిధి రావు హైదరి, అను ఇమ్మానుయేల్ ఈ సినిమాలో హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

Advertisement

ఈ సినిమాను ఏకె ఎంటర్‌టైన్‌ మెంట్స్‌ పతాకంపై నిర్మిస్తున్నారు..

https://youtu.be/-W3SLhnv4iE

తాజా వార్తలు