2 వారాల్లో పొట్టపై స్ట్రెచ్ మార్క్స్ ను మాయం చేసే మ్యాజికల్ ఆయిల్ మీకోసం!

స్ట్రెచ్ మార్క్స్.దాదాపు స్త్రీలందరూ ఎదుర్కొనే సమస్యల్లో ఇది ఒకటి.

ముఖ్యంగా ప్రసవం అనంతరం పొట్టపై స్ట్రెచ్ మార్క్స్ చాలా అసహ్యంగా కనిపిస్తుంటాయి.

వీటిని నివారించుకోవడం కోసం చాలా ప్రయత్నాలు చేస్తుంటారు.

కొందరు ట్రీట్మెంట్ కూడా చేయించుకుంటారు.కానీ ఇంట్లోనే చాలా సులభంగా స్ట్రెచ్ మార్క్స్ ను వదిలించుకోవచ్చు.

అందుకు ఇప్పుడు చెప్పబోయే మ్యాజికల్ ఆయిల్ అద్భుతంగా సహాయపడుతుంది.ఈ ఆయిల్ తో ప్రతిరోజు మసాజ్ చేసుకుంటే కేవలం రెండు వారాల్లోనే స్ట్రెచ్ మార్క్స్ దూరం అవుతాయి.

Advertisement
Magical Oil To Remove Stretch Marks On The Stomach In 2 Weeks Is For You! Magica

మరి ఇంతకీ ఆ మ్యాజికల్ ఆయిల్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలి.? వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా ఒక మందపాటి గిన్నె ను తీసుకుని అందులో ఒక కప్పు స్వీట్ ఆల్మండ్ ఆయిల్ ను వేసుకోవాలి.

ఈ ఆయిల్ లో పది నుంచి పన్నెండు ఎండిన శంకు పుష్పాలను వేసుకోవాలి.అలాగే గుప్పెడు ఎండిన ఆరెంజ్ పండు తొక్కలు వేసి గంట పాటు నానబెట్టుకోవాలి.

ఆ తర్వాత ఈ గిన్నెను లో ఫ్లేమ్ పై పది నుంచి పదిహేను నిమిషాల పాటు ఉంచి ఉడికించాలి.ఆపై స్టవ్ ఆఫ్ చేసి హీట్ చేసిన ఆయిల్ ను ఒక రోజు మొత్తం మూత పెట్టి వదిలేయాలి.

మరుసటి రోజు పల్చటి వస్త్రం సహాయంతో ఆయిల్ ను స్ట్రైనర్‌ సహాయంతో ఫిల్టర్ చేసుకుని ఒక బాటిల్ లో నింపుకోవాలి.నైట్ నిద్రించే ముందు ఈ ఆయిల్ ను పొట్టపై అప్లై చేసి రెండు చేతులతో స్మూత్ గా క‌నీసం ప‌ది నిమిషాల పాటు మసాజ్ చేసుకోవాలి.

Magical Oil To Remove Stretch Marks On The Stomach In 2 Weeks Is For You Magica
న్యూస్ రౌండప్ టాప్ 20

ప్రతిరోజు ఈ విధంగా చేస్తే పొట్టపై ఏర్పడ్డ స్ట్రెచ్ మార్క్స్ క్రమంగా దూరం అవుతాయి.పొట్ట వద్ద చర్మం టైట్ గా మారుతుంది.మ‌రియు పొట్టపై ఈ విధంగా రోజు మసాజ్ చేసుకోవడం వల్ల బెల్లీ ఫ్యాట్ సమస్య సైతం త‌గ్గు ముఖం పడుతుంది.

Advertisement

తాజా వార్తలు