ఈ మ్యాజికల్ ఆయిల్ తో స్ట్రెచ్ మార్క్స్ ను నెల రోజుల్లో వదిలించుకోవచ్చు.. తెలుసా?

స్ట్రెచ్ మార్క్స్.మహిళల్లో సర్వసాధారణంగా వేధించే సమస్య ఇది.

ముఖ్యంగా ప్రసవం అనంతరం ఈ సమస్య కారణంగా ఇబ్బంది పడేవారు కోట్ల సంఖ్యలో ఉన్నారు.

ప్రెగ్నెన్సీ కారణంగా పొట్టపై ఏర్పడే స్ట్రెచ్ మార్క్స్( Stretch marks ) చాలా అసహ్యంగా కనిపిస్తుంటాయి.

వీటి వల్ల మహిళలు ఎంతో అసౌకర్యానికి గురవుతుంటారు.ఈ క్రమంలోనే స్ట్రెచ్ మార్క్స్ ను వదిలించుకోవడం కోసం ముప్ప తిప్పలు పడుతుంటారు.కొందరు వేల‌కు వేలు ఖ‌ర్చు పెట్టి స్ట్రెచ్ మార్క్స్ రిమూవ‌ల్ ట్రీట్మెంట్ కూడా చేయించుకుంటారు.

కానీ ఇప్పుడు చెప్పబోయే మ్యాజికల్ ఆయిల్ ను వాడితే స్ట్రెచ్ మార్క్స్ కేవలం నెల రోజుల్లో మాయం అవుతాయి.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ ఆయిల్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.

Advertisement

ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో మూడు టేబుల్ స్పూన్లు అవిసె గింజలు( Flax seeds ) వేసి మెత్తని పౌడర్ మాదిరి గ్రైండ్ చేసుకోవాలి.ఆ తర్వాత ఒక గిన్నె తీసుకుని అందులో ఒక కప్పు ఆలివ్ ఆయిల్( Olive oil ), అరకప్పు కొబ్బరి నూనె ( coconut oil ) వేసుకోవాలి.

అలాగే రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్లు అవిసె గింజల పొడి, వన్ టేబుల్ స్పూన్ గ్రీన్ టీ పౌడర్( Tea powder ), వన్ టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్ వేసి బాగా మిక్స్ చేయాలి.ఇప్పుడు ఈ గిన్నెను మరుగుతున్న నీటిలో ఎనిమిది నుంచి పది నిమిషాల పాటు హీట్ చేయాలి.ఇలా డబుల్ బాయిలర్ మెథడ్ లో మరిగించిన ఆయిల్ ను చల్లారబెట్టుకోవాలి.

పూర్తిగా కూల్ అయిన అనంతరం స్ట్రైనర్ సహాయంతో ఆయిల్ ను ఫిల్టర్ చేసుకొని స్టోర్ చేసుకోవాలి.

స్ట్రెచ్ మార్క్స్ ను నివారించడానికి ఈ ఆయిల్ ఎంతో ఉత్తమం గా సహాయపడుతుంది.నైట్ నిద్రించే ముందు ఈ ఆయిల్ ను స్ట్రెచ్ మార్క్స్ ఉన్నచోట అప్లై చేసుకొని కనీసం ఐదు నిమిషాల పాటు బాగా మసాజ్ చేసుకోవాలి.ఈ విధంగా ప్రతిరోజు కనుక చేస్తే కేవలం నెల రోజుల్లోనే మంచి రిజల్ట్ ను మీరు గమనిస్తారు.

కమల్ హాసన్ భారతీయుడు 3 తో మరోసారి నట విశ్వరూపాన్ని చూపించబోతున్నాడా..?
కీర్తి సురేష్ పెళ్లి చీర కోసం అన్ని గంటలు కష్టపడ్డారా.. ఆ చీర ప్రత్యేకత ఏంటో తెలుసా?

స్ట్రెచ్ మార్క్స్ దెబ్బకు మాయం అవుతాయి.కాబట్టి స్ట్రెచ్ మార్క్స్ సమస్యతో సతమతం అవుతున్న వారు తప్పకుండా ఈ మ్యాజికల్ ఆయిల్ ను ప్రిపేర్ చేసుకుని వాడేందుకు ప్రయత్నించండి.

Advertisement

తాజా వార్తలు