లేటు వయసులో ఘాటు ప్రేమ, 61 ఏళ్ల సింగర్ 25 ఏళ్ల డ్యాన్సర్ తో ప్రేమాయణం

హాలీవుడ్ పాపులర్ సింగర్ మడోన్నా గురించి అందరికీ తెలిసిందే.ఆగస్టు 16, 1958 న జన్మించిన ఆమె 1980 లో ఆన్ స్టేజ్ మ్యూజిక్ ప్రోగ్రామ్స్ తో అందరిని ఒక ఊపు ఊపింది.

తన సంగీతం తో మంచి పాపులారిటీ సంపాదించుకున్న ఈ ముదురు ముద్దు గుమ్మ తాజాగా తన ప్రేమాయణం తో వార్తల్లోకి ఎక్కింది.61 ఏళ్ల మడోన్నా 25 ఏళ్ల డ్యాన్సర్ తో ప్రేమాయణం నడుపుతుండడం విశేషం.25 ఏళ్ల డ్యాన్సర్ విలియమ్స్ ని మడోన్నా గాఢంగా ప్రేమిస్తుంది, గత కొద్దీ రోజులుగా వీరిద్దరూ కూడా తమ ప్రేమలో మునిగి తేలుతున్నారు.ఇద్దరి మధ్య దాదాపు 36 ఏళ్ల తేడా ఉన్నప్పటికీ వారిద్దరూ పరస్పరం ప్రేమించుకోవడం ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్ గా మారింది.

అయితే ఇద్దరి మధ్య అన్ని సంవత్సరాలు గ్యాప్ ఉన్నప్పటికీ వారిద్దరూ ప్రేమలో మునిగితేలడం తో వారి ప్రేమకు ఒకే చెప్పినట్లు విలియమ్స్ తండ్రి తెలిపారు.గ‌తంలో త‌మ ప్రేమ గురించి చిన్న హింట్ ఇచ్చిన విలియ‌మ్స్ ఏడాది పాటు సీక్రెట్‌గా ఆమె తో డేటింగ్ చేశాడని, ప్రేమ‌కి వ‌య‌స్సుతో సంబంధం లేద‌ని వీరిద్దరూ నిరూపించారు అంటూ విలియమ్స్ తండ్రి తెలిపారు.

అంతేకాకుండా 2020లో లండ‌న్‌, ఫ్రాన్స్‌ల‌లో జ‌ర‌గ‌నున్న మడోన్నా షోస్ కి మడోన్నా వారిని ఆహ్వానించిందని, ఆ షో కు కూడా హాజరు కానున్నట్లు అతను తెలిపారు.మొత్తానికి ఈ 61 ఏళ్ల ముదురు ముద్దు గుమ్మ తన ప్రేమాయణం తో మరోసారి వార్తల్లో నిలిచింది అన్నమాట.

న్యూస్ రౌండప్ టాప్ 20
Advertisement

తాజా వార్తలు