విమానంలో ప్రయాణం చేయాలంటే డబ్బులు చెల్లించి టికెట్ తీసుకుంటే సరిపోదు, సదరు విమాన యాజమాన్యం పెట్టే షరతులను కూడా అంగీకరించాలి.ఇలాంటి ఘటనతో ఓ 10 ఏళ్ల బాలుడు, అతడి తల్లిదండ్రులు అవాక్కయ్యారు.
తమకు జరిగిన అవమానం గురించి సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు.
దక్షిణాఫ్రికాలోని జోహెన్నెస్‌బర్గ్ విమానాశ్రయంలో 10 ఏళ్ల స్టీవి లుకాస్ అనే బాలుడు అతడి తల్లిదండ్రులతో కలిసి న్యూజిలాండ్ వెళ్లేందుకు విమానం ఎక్కబోయాడు.
అయితే అతడు వేసుకున్న టీషర్టుపై పాము బొమ్మ ఉండటంతో ఆ బాలుడిని, అతడి తల్లిదండ్రులను ఎయిర్‌పోర్ట్ సిబ్బంది అడ్డుకున్నారు.బాలుడు వేసుకున్న టీషర్టు మార్చుకుని ప్రయాణం చేయాల్సిందిగా వారు తెలిపారు.
ఎందుకని ప్రశ్నించిన బాధితులకు పాము బొమ్మను చూసి విమానంలో ప్రయాణికులు భయపడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

దీంతో చేసేది ఏమీలేక ఆ బాలుడి టీషర్టు మార్చుకుని విమాన ప్రయాణం చేశారు స్టీవ్ కుటుంబం.ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ కావడంతో నెటిజన్లు నోరెళ్లబెడుతున్నారు.







