బాలయ్య నాకు మామయ్య.. సెట్లో చూసి ఆశ్చర్యపోయా.. ప్రముఖ నటి కామెంట్స్ వైరల్!

టాలీవుడ్ ఇండస్ట్రీలో పముఖ నటీమణి, కొరియోగ్రాఫర్, కూచిపూడి డ్యాన్సర్ గా గుర్తింపును సొంతం చేసుకున్న మధిరిమ నార్ల ( Madhirima Narla )ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అసక్తికర విషయాలను వెల్లడించారు.

నా జర్నీలో నేను ఎక్కువ శాతం బాలయ్య బాబుతో వర్క్ చేశానని మధురిమ నార్ల అన్నారు.

బాలయ్యను నేను మామయ్య మామయ్య అని అంటానని ఆమె చెప్పుకొచ్చారు.బాలయ్య చాలా ప్రేమగా చూసుకునేవారు అని మధురిమ నార్ల కామెంట్లు చేశారు.

బాలయ్య( Balayya ) సెట్ లో ఉండే సమయంలో చాలా జోవియల్ గా ఉండేదని ఆమె చెప్పుకొచ్చారు.ప్రతి సీన్ అలా పడేవని మధురిమ పేర్కొన్నారు.

బాలయ్య పేకాడుతూ ఉండేవారని ఆమె చెప్పుకొచ్చారు.బాలయ్య జోవియల్ గా సెట్ లో ఉంటూనే ఎమోషనల్ సీన్స్ లో నటించాల్సి వచ్చినా పూర్తిగా మారిపోయి నటించేవారని మధురిమ నార్ల వెల్లడించడం గమనార్హం.

Advertisement

బాలయ్య ఎమోషన్ ను పండించడానికి నిగ్రహ శక్తితో ఉండేవారని ఆమె పేర్కొన్నారు.

ఆ సీన్ అయ్యేవరకు బాలయ్య మాట్లాడేవారు కాదని మధురిమ తెలిపారు.సీనియర్ ఎన్టీఆర్ ( Senior NTR )గురించి బాలయ్య అద్భుతమైన చాలా విషయాలు చెప్పేవారని ఆయన అన్నారు.కొన్ని జీవితానికి చాలా పనికొచ్చేవిగా ఉండేవని మధురిమ పేర్కొన్నారు.

మురళీ మోహన్ అంకుల్ చాలా వ్యాపారాలు చేస్తున్నా ఆర్టిస్ట్ గా వచ్చిన గుర్తింపు డబ్బులు ఉంటే రాదని చెప్పేవారని ఆమె కామెంట్లు చేశారు.

మనం ఉన్నా లేకపోయినా సినిమాలలో నటిస్తే మనల్ని గుర్తు పెట్టుకుని ప్రేక్షకులు ఎమోషనల్ అవుతారని మురళీ మోహన్( Murali Mohan ) చెప్పేవారని మధురిమ నార్ల వెల్లడించారు.నువ్వు ఎందుకు సినిమాలు చేయడం లేదని ఆయన ప్రశ్నించారని మధురిమ నార్ల పేర్కొన్నారు.మధురిమ చెప్పిన విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Marathon: Atención Al Cliente Y Calidad Del Servicio — Guía Práctica Para Jugadores De Arg...
Felix Spin — Die Besten Spiele Und Slots Im Vergleich

మధురిమ నార్ల కెరీర్ పరంగా మరింత సక్సెస్ సాధించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

Advertisement

తాజా వార్తలు