బాలీవుడ్‌తో పోల్చితే టాలీవుడ్‌లో మగ డామినేషన్ కాస్త అధికం అని చెప్పక తప్పదు.
టాలీవుడ్‌లో హీరోల స్థాయిలో హీరోయిన్స్‌కు పారితోషికం ఇవ్వక పోవడంతో పాటు, హీరోయిన్స్‌కు అంతగా గుర్తింపు, ప్రాముఖ్యతను కూడా తెలుగు ఫిల్మ్ మేకర్స్ ఇవ్వరు.
హీరోలకు ఇచ్చినంత గౌరవం మరియు ఫెసిలిటీస్ హీరోయిన్స్‌కు ఇవ్వరు అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.సౌత్ నుండి బాలీవుడ్‌కు ఎంతో మంది హీరోయిన్స్ వెళ్తారు.
అయితే బాలీవుడ్ నుండి మాత్రం సౌత్‌కు చాలా తక్కువ మంది హీరోయిన్స్ వస్తారు.ఎందుకంటే వారికి ఎక్కువ పారితోషికం ఇవ్వాల్సి ఉంటుంది, అలాగే హీరో స్థాయిలో వారికి మర్యాదలు చేయాల్సి ఉంటుంది.
తెలుగు సినిమా పరిశ్రమలో హీరోలు కూడా హీరోయిన్స్‌కు ఎందుకు తక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నారు అంటూ అడిగిన దిక్కు లేదు.ఎన్ని సార్లు, ఎన్ని విధాలుగా హీరోయిన్స్ అవమానాలు ఎదుర్కొన్నా కూడా హీరోలు మాత్రం పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేవు.ఆ హీరోల్లో మహేష్‌బాబు కూడా ఉన్నాడు అని, తన సినిమాలో నటించడం, పూర్తి చేసుకుని వెళ్లి పోవడం మినహా, ఇతర నటీనటులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు మరియు ఇతరత్ర విషయాలను మహేష్ బాబు పట్టించుకోడు అంటూ మాధవిలత సంచలన వ్యాఖ్యలు చేసింది.
మహేష్‌బాబు హీరోగా నటించిన ‘అతిథి’ చిత్రంలో మాధవిలత చిన్న పాత్రలో కనిపించింది.షూటింగ్‌లో ఒకానొక సమయంలో దర్శకుడు సురేందర్ రెడ్డి పెద్ద బూతు మాట మాధవిలతను అన్నాడట.
రీ షూట్స్ జరపాల్సి వస్తుండటంతో సురేందర్ రెడ్డి ఆగ్రహంతో ఆ మాట అని ఉంటాడు.మహేష్ ముందు ఆ మాట అన్నప్పటికి దర్శకుడిని మందలించక పోవడంతో పాటు, కనీసం రెస్పాండ్ కాలేదు అంటూ మాధవి లత ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఈ అమ్మడు గతంలో కూడా పలు సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెల్సిందే.కాస్టింగ్ కౌచ్ గురించి ఎక్కువగా మాట్లాడిన హీరోయిన్స్‌లో మాధవిలత ఒకరు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
వరుసగా చిత్రాల్లో నటించే అవకాశాలు రావాలి అంటే ఖచ్చితంగా హీరోలు, దర్శకు చెప్పినట్లుగా మసులుకోవాల్సిందే అని, వారి కోర్కెలు తీర్చాల్సిందే అంటూ మాధవిలత సంచలన వ్యాఖ్యలు చేసింది.సినిమా పరిశ్రమలో హీరోయిన్స్ లేడీ ఆర్టిస్టులు పడుతున్న ఇబ్బందులు ఈమద్య కాలంలోనే వెలుగులోకి వస్తున్నాయి.
వాటిపై చర్యలు కూడా తీసుకుంటూ చిత్ర రంగ పెద్దలు ముందుకు సాగుతున్నారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy