ఇప్పటికే టీడీపి, జనసేన పార్టీలు ( TDP Janasena parties )ఏపీలో పొత్తు పెట్టుకున్నాయి.రెండు పార్టీలు కలిసి 2024 లో ఎన్నికలకు వెళ్ళేందుకు సిద్ధమవుతున్నాయి.
ఈ మేరకు ఇప్పటికే సీట్ల సర్దుబాటు వ్యవహారం పైన చర్చలు జరుగుతున్నాయి.ఉమ్మడిగా రెండు పార్టీలు కలిసి వైసిపి ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తూ ప్రజా సమస్యలపై పోరాడాలని నిర్ణయించుకున్నాయి.
ఇక భారీ బహిరంగ సభలు నిర్వహిస్తూ, టిడిపి , జనసేన ను మరింతగా ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి.ఇది ఎలా ఉంటే టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువ గళం పాదయాత్ర ఈనెల 17న ముగుస్తోంది.
కుప్పంలో మొదలైన పాదయాత్ర వాస్తవంగా శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురంలో ముగియాల్సి ఉన్నా, దానిని భీమిలిలో లోకేష్ ముగించనున్నారు.రాజోలులో లోకేష్ పాదయాత్ర జరుగుతుండగానే చంద్రబాబు నాయుడును( Chandrababu Naidu ) సిఐడి అధికారులు స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో అరెస్టు చేయడంతో, అప్పటి నుంచి పాదయాత్రకు బ్రేక్ ఇచ్చారు.

చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్ వచ్చిన తర్వాత మళ్లీ రాజోల నుంచి పాదయాత్రను ప్రారంభించారు.నవంబర్ 27న ఈ యాత్ర పునః ప్రారంభమైంది.అయితే ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో, మరికొంత కాలం పాదయాత్రను నిర్వహిస్తే మిగతా విషయాలపై దృష్టి పెట్టలేమని భావిస్తున్న లోకేష్ విశాఖ జిల్లాలోని భీమిలి నియోజకవర్గంలో ఈ యాత్రను ముగించాలని నిర్ణయించుకున్నారు .పాదయాత్ర ముగింపు సందర్భంగా భారీ బహిరంగ సభను నిర్వహించాలని భావిస్తున్నారు .ఈ సభకు టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుతో పాటు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హాజరు కాబోతున్నట్లు టిడిపి వర్గాలు పేర్కొన్నాయి.

వాస్తవంగా 400 రోజులు, 4000 కిలోమీటర్లు లోకేష్ పాదయాత్ర( Lokesh Padayatra ) జరగాల్సి ఉంది కానీ సమయాభావం వల్ల లోకేష్ యువ గళం పాదయాత్రను కుదించారు.ఇక భీమిలో నిర్వహించే సభకు అటు చంద్రబాబు, ఇటు పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) హాజరుకాబోతుండడంతో ఈ భారీ బహిరంగ సభకు టిడిపి భారీగానే ఏర్పాట్లు చేస్తోంది. టిడిపి , జనసేన కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొనే విధంగా ఇప్పటి నుంచే అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
ఉత్తరాంధ్రలో మెజార్టీ సీట్లు టిడిపి, జనసేన కూటమి గెల్చుకుంటుందనే ఆశాభావంతో రెండు పార్టీల నేతలు ఉన్నారు.







