నేను చిరంజీవి అభిమానిని.. వైరల్ అవుతున్న లోకేశ్ సంచలన వ్యాఖ్యలు!

చంద్రబాబు నాయుడు కొడుకు నారా లోకేశ్ పాదయాత్రలో భాగంగా చిరంజీవి, పవన్ గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతున్నాయి.లోకేశ్ మాట్లాడుతూ తాను చిరంజీవి అభిమానినని వాల్తేరు వీరయ్య మూవీ కూడా చూశానని అన్నారు.

 Lokesh Sensational Comments Goes Viral In Social Media Details Here , Nara Lokes-TeluguStop.com

బాలయ్య మామ నా ముద్దుల మామయ్య అని లోకేశ్ కామెంట్లు చేశారు.మామయ్య సినిమాలు రిలీజైన రోజు ఫస్ట్ షో చూస్తానని లోకేశ్ చెప్పుకొచ్చారు.

2014 సంవత్సరంలో పవన్ కళ్యాణ్ మంచి మనస్సును చూశానని పవన్ కళ్యాణ్ అప్పటికి ఒక్కసారి మాత్రమే కలిశానని లోకేశ్ కామెంట్లు చేయడం గమనార్హం.ఉద్యోగాల కల్పనే జగన్ రెడ్డికి నేను ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ అంటూ లోకేశ్ కామెంట్లు చేశారు.

లోకేశ్ చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే.నారా లోకేశ్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది.

Telugu Balakrishna, Chiranjeevi, Janasena, Lokesh, Padayatra, Pawan Kalyan, Toll

ఆయన చేపట్టిన యువగళం పాదయాత్రకు ప్రేక్షకుల నుంచి చెప్పుకోదగ్గ స్థాయిలో రెస్పాన్స్ వస్తుండటం గమనార్హం.వచ్చే ఎన్నికల్లో లోకేశ్ మంగళగిరి నుంచి పోటీ చేయనున్నారు.ఈసారి ఎన్నికల్లో కచ్చితంగా గెలిచేలా లోకేశ్ నిర్ణయాలు తీసుకుంటున్నారు.లోకేశ్ కెరీర్ విషయంలో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తారో చూడాల్సి ఉంది.నారా లోకేశ్ ఏపీకి కాబోయే సీఎం అని టీడీపీ నేతలు భావిస్తున్నారు.

Telugu Balakrishna, Chiranjeevi, Janasena, Lokesh, Padayatra, Pawan Kalyan, Toll

లోకేశ్ పై కొన్ని విషయాలకు సంబంధించి ట్రోల్స్ వస్తున్నా గతంతో పోల్చి చూస్తే ఆ ట్రోల్స్ తక్కువేనని అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.లోకేశ్ ప్రతి విషయంలో సక్సెస్ అయ్యేలా చంద్రబాబు సైతం తన వంతు సహాయసహకారాలు అందిస్తున్నారని తెలుస్తోంది.లోకేశ్ ఈసారి కచ్చితంగా ఎమ్మెల్యే అవుతారని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

లోకేశ్ ను ఓడించటానికి వైసీపీ ఎలాంటి నిర్ణయాలతో ముందుకెళుతుందో చూడాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube