హతవిధి.. ఆ రాష్ట్రంలో మరో 14 రోజులు పొడిగించిన‌ లాక్‌డౌన్.. !

కరోనా సెకండ్ వేవ్ ప్రజలకు ప్రాణాంతకంగా మారి ఎందరి ఊపిరో తీస్తున్న ఘటనలు కళ్ల ముందు కనిపిస్తున్నాయి.

కోవిడ్ నివారించడానికి వ్యాక్సిన్ వచ్చినా దీని వ్యాప్తి మాత్రం ఆగలేదు.

ఇక విధిలేక ఆన్ని రాష్ట్రాలు లాక్‌డౌన్ వైపు అడుగులు వేశాయి.ఈ నేపధ్యంలో కొన్ని రాష్ట్రాల్లో లాక్‌డౌన్ అమలు చేయబట్టి నెలరోజులు దాటిపోయింది.

Karnataka, Lockdown Extended, 14 Days, CM Yeddyurappa-హతవిధి.. ఆ �

మరి కొన్ని రాష్ట్రాల్లో పది నుండి పదిహేను రోజులు దాటగా కరోనా కేసుల తీవ్రత తగ్గుముఖం పట్టకపోవడంతో మళ్లీ తిరిగి లాక్‌డౌన్ పొడిగిస్తున్నారు.ఇప్పటికే తెలుగు రాష్ట్రాలతో పాటుగా మిగతా రాష్ట్రాలు ఈ చర్యలను అమలు చేస్తున్నారు.

అయితే తాజాగా కర్ణాటక ప్ర‌భుత్వం కూడా మ‌రోసారి లాక్‌డౌన్‌ను పొడిగించింది.కాగా ప్రస్తుత లాక్‌డౌన్‌ గడువు ఈనెల 24 తో ముగిసిపోతుండగా తిరిగి జూన్‌ 7వ తేదీ వరకు లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్నట్లు ఆ రాష్ట్ర సీఎం యడ్యూరప్ప ప్ర‌క‌టించారు.

Advertisement

ఇక యధావిధిగా ఉదయం 6 నుండి 10 గంటల వరకు మాత్రం ప్రజలకు బయటకు వెళ్లడానికి అనుమతి ఇచ్చారు.

వృద్ధాప్యాన్ని వాయిదా వేసే అద్భుతమైన పానీయం
Advertisement

తాజా వార్తలు