ఒక మంచి తల్లికి పుడితే భోళాపై బ్యాడ్ కామెంట్స్ రాయరు.. లోబో షాకింగ్ కామెంట్స్!

భోళా శంకర్ సినిమా ప్రస్తుతం సోషల్ మీడియా ట్రోల్స్ ద్వారా వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే.

బుక్ మై షో వెబ్ సైట్ లో సైతం ఈ సినిమా బుకింగ్స్ ఆశించిన స్థాయిలో లేవు.

ఇండిపెండెన్స్ డే సెలవును సైతం ఈ సినిమా క్యాష్ చేసుకునే అవకాశాలు కనిపించడం లేదు.మెహర్ రమేష్ మరోసారి శక్తిని చూపించాడంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనర్హం.

అయితే ఈ సినిమాలో కీలక పాత్రలో నటించిన లోబో( Lobo ) నెగిటివ్ రివ్యూల గురించి, నెగిటివ్ కామెంట్ల గురించి స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.ఒక మంచి తల్లికి పుడితే భోళా శంకర్ మూవీపై బ్యాడ్ కామెంట్స్ రాయరని లోబో చెప్పుకొచ్చారు.

సోషల్ మీడియాలో సినిమా గురించి బ్యాడ్ కామెంట్లు చేయడం, ఆ కామెంట్లను వైరల్ చేయడం మంచి పద్ధతి కాదని లోబో అన్నారు.ఎందుకు చెత్త కామెంట్లు రాస్తున్నారో అర్థం కావడం లేదని లోబో వెల్లడించారు.

Advertisement

బ్యాడ్ కామెంట్లు చేసేముందు ఒకసారి ఆలోచించాలని ఒక మంచి తల్లికి పుడితే ఈ విధంగా బ్యాడ్ కామెంట్లు రాయరని ఆయన కామెంట్లు చేశారు.భోళా శంకర్ గురించి నెగిటివ్ కామెంట్లు చేయాల్సిన అవసరం ఏముందని లోబో చెప్పుకొచ్చారు.

భోళా శంకర్ ( Bhola Shankar )సినిమాతో పాటు నాపై కూడా బ్యాడ్ కామెంట్లు చేశారని లోబో పేర్కొన్నారు.మేము ఎంత కష్టపడతామో కామెంట్లు చేసిన వాళ్లకు తెలియదని లోబో అన్నారు.

ఒక సినిమాను ఎన్ని కోట్లు ఖర్చు చేసి తీస్తారో మీకు తెలియదని లోబో పేర్కొన్నారు.ఎంతో కష్టపడిన సినిమాను ఒకే ఒక్క మాటతో బాలేదు అని చెబుతారని లోబో వెల్లడించారు.కష్టాన్ని నమ్మిన వాళ్లు బ్యాడ్ కామెంట్లు చేయరని లోబో తెలిపారు.

Validation Check 2026
జొన్న పిండితో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో!

లోబో వెల్లడించిన విషయాలు సోషల్ మీడియా( Social media ) వేదికగా వైరల్ అవుతున్నాయి.

Advertisement