పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో( Hindupuram ) ఎంపీ టికెట్ కోసం టీడీపీ నేతల( TDP Leaders ) మధ్య పోటీ నెలకొంది.ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ( Mla Nandamuri Balakrishna ) ఆమోదం ఉంటే తమకు సీటు దక్కుతుందని కొందరు ఆశావహులు భావిస్తున్నారట.
ఈ నేపథ్యంలోనే బాలయ్య దగ్గర టీడీపీ నేతలు బలప్రదర్శన ఇస్తూ పోటాపోటీగా వినతిపత్రాలు అందజేస్తున్నారు.
మరోవైపు నందమూరి బాలకృష్ణ గత మూడు రోజులుగా పార్టీ శ్రేణులతో సమీక్షలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.హిందూపురం లోక్ సభ టికెట్ ఎవరికీ ఖరారు కాకపోవడంతో ఆశవాహులు తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు.కాగా ఎంపీ టికెట్( MP Ticket ) రేసులో నియోజకవర్గానికి చెందిన కొల్లకుంట అంజినప్ప, వాల్మీకి అంబికా లక్ష్మీనారాయణ ఉన్నారని తెలుస్తోంది.