ఒక అజ్ఞాతవాసి. ఒక రాధేశ్యామ్.. ఇప్పుడు ఆచార్య..భారీ డిజాస్టర్ సినిమాల సరసన మెగా మూవీ

తమ్ముడి పవన్ ను పక్కకు నెట్టి తాను ఆస్థానంలోకి చేరేందుకు దగ్గర్లో ఉన్న చిరంజీవి.ఈ లెక్క లేంటి ఎందుకు అనుకుంటున్నారా.

 List Of Big Disasters In Recent Days Big Disasters, Tollywood, Acharya , Ram Cha-TeluguStop.com

స్టార్ హీరోల చిత్రాలకు ప్రీ రిలీజ్ బిజినెస్ ఏ స్థాయిలో జరుగుతుంది అన్నది తెలిసిందే.కోట్లతో ముడిపడిన ఈ మార్కెట్ లెక్కలు సినిమా రిజల్ట్ కనుక తారుమారు అయితే అంతకన్నా ఎక్కువ నస్టాలనే చూడాల్సి వస్తుంది.

ఈ క్రమంలో టాలీవుడ్ లో నష్టాలను మూటగట్టుకున్న టాప్ చిత్రాల చిట్టా పద్దులను కనుక చూస్తే ముందుగా భారీ నష్టాన్ని చవిచూసింది ప్రభాస్ హీరోగా నటించిన రాధేశ్యాం చిత్రమనే చెప్పాలి.ఆ తర్వాత స్థానంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చిత్రం అజ్ఞాతవాసి, మూడో స్థానంలో మహేష్ బాబు మూవీ స్పైడర్ లు నిలిచాయి.

అయితే ఈ డిజాస్టర్ మూవీ లిస్ట్ లోకి ఆచార్య చిత్రం కూడా చేరే అవకాశం ఉందని సినీ విశ్లేషకుల అంచనా.

అందులోనూ రెండవ స్థానం లోకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి అంటున్నారు.అంటే అజ్ఞాత వాసి ప్లేస్ లో ఆచార్య మూవీ వచ్చి చేరినా చేరవచ్చు సుమీ.2022 మార్చిలో ఎన్నో అంచనాల నడుమ విడుదల అయిన పాన్ ఇండియా మూవీ ‘రాధేశ్యామ్‘ టాలీవుడ్ చరిత్రలో అత్యధిక నష్టాలను మూటగట్టుకున్న చిత్రంగా నిలిచింది.ఈ సినిమా బిజినెస్ విషయానికి వస్తే ప్రపంచ వ్యాప్తంగా రూ.202.80 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ ఈ మూవీకి జరుగగా.ట్రేడ్ వర్గాల ప్రకారం ఫుల్ రన్ లో 83.20 కోట్ల షేర్ మాత్రమే వసూళ్లు చేసిందని మిగిలిన 120 కోట్లకు పైగా సొమ్ము బయ్యర్లుకు నష్టమే అని సమాచారం.ఇక ఈ సినిమా తరువాత రెండవ భారీ లాస్ స్థానంలో 66 కోట్ల మెగా లాస్ తో ‘అజ్ఞాతవాసి‘ సినిమా లిస్ట్ లో ఉంది.

ఈ మూవీ తర్వాత ఇదే తరహాలో ఇంచుమించుగా ఒకే ఫిగర్ 60 కోట్ల భారీ నష్టం తో ‘స్పైడర్’ సినిమా ఉండగా ఇప్పుడు ‘అజ్ఞాతవాసి’ సినిమా నష్టాలను మించిన లాస్ ను వెంటబెట్టుకుని ఆ ప్లేస్ లోకి వచ్చే దిశగా ఆచార్య మూవీ పయనిస్తోంది అని సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం.

Telugu Acharya, Agnyaathavaasi, Chiranjeevi, Mahesh Babu, Pawan Kalyan, Prabhas,

కొరటాల శివ డైరెక్షన్ లో మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ ల మెగా కాంబోలో వచ్చిన చిత్రం ‘ఆచార్య’.ఏప్రిల్ 29 న ఎంతో ఘనంగా రిలీజ్ అయిన ఈ సినిమా మొదటి షో నుండే నెగిటివ్ టాక్ తో డౌన్ అయ్యింది.కలెక్షన్లు కూడా భారీగా పడిపోతున్నాయి.వరల్డ్ వైడ్ గా 131.20 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ చేసిన ఈ మెగా చిత్రం, మూడు రోజుల్లో 45.52 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది.అంటే ఇంకా టార్గెట్ రీచ్ అవడానికి 86 కోట్ల దూరంలో ఉంది.

అయితే అది కష్టమే అంటున్నారు విశ్లేషకులు.తెలుగు రాష్ట్రాల్లో 107.50 కోట్ల బిజినెస్ చేసిన ఆచార్య సినిమా మూడు రోజుల్లో కేవలం 38.72 కోట్ల కలెక్షన్స్ ను మాత్రమే రాబట్టింది.మొదటి వారంలోనే ఇంత దారుణమైన కలెక్షన్లు ఉంటే ఇక పోను పోను వసూళ్లు ఏ స్థాయిలో తగ్గుతాయా అన్నది అర్దం చేసుకోవచ్చు.దీంతో మొత్తానికి తెలుగు రాష్ట్రాల్లోనే 60 కోట్లకు పైగా నష్టాలను చవి చూసే అవకాశం ఉందని అంచనా.

ఇక ప్రపంచ వ్యాప్తంగా గా 70 కోట్ల నష్టాలను సొంత చేసుకునే అవకాశం ఉందని అంచనాలు వినపడుతున్న నేపథ్యంలో ఈ సినిమా లాస్ లిస్ట్ లో రెండవ స్థానంలో చేరే అవకాశం ఉందని అంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube