రంగస్థలం, కాంతార సినిమాలు ఒకటేనా.. ఇందులో నిజమెంత?

తాజాగా విడుదలైన కాంతారా సినిమాపై ఒక వార్త తెగ చక్కర్లు కొడుతోంది.

అదేమిటంటే కాంతారా, రామ్ చరణ్ నటించిన రంగస్థలం సినిమా రెండు ఒకేలాగా ఉన్నాయి అంటున్నారు చెర్రీ అభిమానులు.

కాంతారా సినిమాలో మెయిన్ స్టోరీ లైన్ చరణ్ సినిమాకు దగ్గరగా ఉందంటూ వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.రంగస్థలం సినిమాలో అన్న కుమార్ బాబుని ప్రెసిడెంట్ చంపేస్తే మొదట్లో గుర్తించని చిట్టిబాటు తర్వాత నిజం తెలుసుకుని అతన్ని మట్టుబెట్టడం సుకుమార్ అద్భుతంగా చూపించారు.

కాంతారా సినిమా రివర్స్ లో ఉంటుంది.అందులో తమ్ముడిని దొర హత్య చేస్తే ముందు పసిగట్టని హీరో చివర్లో దేవుడి వేషంలో ఉగ్రరూపం ధరించి అతన్ని చంపేస్తాడు.

అయితే ఇతర విషయాలలో ఎలాంటి పోలికలు లేకపోయినా ఎమోషన్ కు సంబంధించిన కీలక పాయింట్ మాత్రం దగ్గరగా ఉంది అంటున్నారు చెర్రీ అభిమానులు.ఇకపోతే రంగస్థలం సినిమా కూడా రా విలేజ్ డ్రామా.

Advertisement
Link Between Rangathalam And Kantara Movies , Rangastalam , Kantara Movie , Ram

కమర్షియల్ అంశాలు ఉన్నప్పటికీ 1985 నాటి పరిస్థితులను చాలా సహజంగా చిత్రీకరించిన తీరు తెలుగు ప్రేక్షకులకు బాగా నచ్చింది.రామ్ చరణ్ ఇమేజ్ ని దృష్టిలో ఉంచుకుని మాస్ కోసం ఐటెం సాంగ్ లాంటివి పెట్టారు అందుకే ఈ సినిమాను అందరూ ఆ చిత్రాన్ని ఆదరించారు.

Link Between Rangathalam And Kantara Movies , Rangastalam , Kantara Movie , Ram

కానీ రంగస్థలం సినిమా సమయంలో పాన్ ఇండియా ట్రెండ్ ఆ సమయంలో లేకపోవడంతో రంగస్థలం తెలుగు కే పరిమితం అయ్యింది.ఆ తర్వాత కన్నడలో చాలా ఆలస్యంగా అనువదించారు.అయితే రంగస్థలం సినిమా కనుక హిందీలోనూ వచ్చి ఉంటే ఆర్ఆర్ఆర్ కంటె ముందే ఎక్కువ గుర్తింపు చరణ్ కు వచ్చేదని అభిమానుల అభిప్రాయం.

ఇందులో కొంత వాస్తవం ఉన్నప్పటికీ మారిన పరిస్థితులను కాంతారాలాంటివి క్యాష్ చేసుకుంటున్నాయి అంటున్నారు.

తెలుగు రాశి ఫలాలు - సెప్టెంబర్ 03 గురువారం, 2020
Advertisement

తాజా వార్తలు