శుక్రవారం నేతి దీపం వెలిగించి.. కలకండ సమర్పిస్తే?

శుక్రవారం చాలా మంది మహిళలు భక్తి శ్రద్ధలతో లక్ష్మీ దేవికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు.

ఆ లక్ష్మీదేవి కరుణ కటాక్షాలు ఉన్నప్పుడు ఆ ఇల్లు సిరిసంపదలతో కళకళలాడుతుందని భావించి శుక్రవారం అమ్మవారికి పూజలు నిర్వహిస్తుంటారు.

అయితే శుక్రవారం లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలనుకునే వారు, మన ఇంట్లో ప్రతికూల పరిస్థితులు తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలగాలంటే శుక్రవారం అమ్మవారికి నేతి దీపంతో పూజ చేయాలని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు.లక్ష్మీ దేవికి ఎంతో ఇష్టమైన నేతి దీపాన్ని శుక్రవారం రోజు బ్రహ్మ ముహూర్తం లో మనకు పూజగదిలో వెలిగించడం ద్వారా అమ్మవారు ప్రీతి చెంది మన ఇంట్లో ఏర్పడిన ప్రతికూల పరిస్థితులను తొలగిస్తుంది.

అయితే ఈ దీపాలను బ్రహ్మ ముహూర్తంలో లేదా సూర్యోదయానికి ముందు 9 దీపాలను వెలిగించడం ద్వారా మనం కోరుకున్న కోరికలు నెరవేరుతాయి.రుణ బాధలు, రాహు, కుజ దోషాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలగాలంటే శుక్రవారం పూట లక్ష్మీదేవి ఫోటో ముందు నేతి దీపం వెలిగించాలని పండితులు తెలియజేస్తున్నారు.

Lighting A Ghee Lamp On Friday Kalakanda Is Offered, Friday Ghee Lamp. Ghee Deep

దాంపత్య జీవితంలో భార్యాభర్తల మధ్య విభేదాలు ఏర్పడినప్పుడు లక్ష్మీదేవి ముందు ఈ దీపం పెట్టడం ద్వారా భార్య భర్తల మధ్య గొడవలు సర్దు మనుగుతాయి.అలాగే శుక్రవారం రోజు చక్రతాళ్వార్ సన్నిధానంలో నేతి దీపం వెలిగించి 12 సార్లు ప్రదక్షిణలు చేస్తే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తి అవుతాయి.ఈ విధంగా 48 రోజుల పాటు చక్రతాళ్వార్సన్నిధానంలో నేతి దీపం వెలిగించడం వల్ల వ్యాపార అభివృద్ధి జరుగుతుంది.

Advertisement
Lighting A Ghee Lamp On Friday Kalakanda Is Offered, Friday Ghee Lamp. Ghee Deep

పితృ దోషాలు ఉన్న వారు సైతం అమావాస్య రోజున ఈ దీపం వెలిగించడం ద్వారా పితృ దోషం నుంచి విముక్తి పొందవచ్చు.నవగ్రహాలలో శుక్రుడి గ్రహానికి శుక్రవారం ఎంతో ప్రీతికరమైనదని చెప్పవచ్చు.

శుక్రుడికి శుక్రవారం ప్రమిదలో కలకండను వేసి దీపం వెలిగించడం ద్వారా భార్యాభర్తల మధ్య దాంపత్య జీవితం కలకాలం సుఖంగా ఉంటుందని పండితులు చెబుతున్నారు.

Advertisement

తాజా వార్తలు