బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమాల్లో రాణించడం అంటే మామూలు విషయం కాదు.
అసలు ఎంట్రీ దక్కడమే కష్టం అంటే సూపర్ స్టార్ అవ్వడం అనేది అతి కొద్ది మందికి మినహా మరెవ్వరికి సాధ్యం కాదు.
తమిళ స్టార్ హీరో విజయ్ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.కెరీర్ ఆరంభంలో ఎన్నో స్టూడియోలు తిరిగి, సినిమా అవకాశాల కోసం ప్రయత్నాలు చేశాడట.
ప్రస్తుతం ఉన్నట్లుగా కాకుండా విజయ్ అప్పట్లో కాస్త నల్లగా ఉండటంతో పాటు, బక్కగా ఉండటంతో హీరోలా చేసేందుకు నువ్వు పనికి రావు అంటూ చీదరించారట.
ఎన్నో అవమానాలు ఎదురైనా కూడా వాటన్నింటిని ఎదుర్కొని, ప్రయత్నాలు చేస్తూనే వచ్చాడు.సుదీర్ఘ ప్రయత్నాల తర్వాత విజయ్‌కి ‘నాలయ తీర్పు’ అనే చిత్రంలో హీరోగా నటించే అవకాశం దక్కింది.ఆ చిత్రం విడుదలైన సమయంలో మీడియాలో విజయ్ గురించి చాలా తప్పుడు కథనాలు, విమర్శనాత్మక కథనాలు వచ్చాయి.
ఈయన హీరో అవ్వాలని ఎలా అనుకుంటున్నాడు, నటన, అందం లేని ఈయన్ను తమిళ ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారని ఈయన భావిస్తున్నాడో అర్థం కావడం లేదు అంటూ ఒక తమిళ మీడియా సంస్థ కథనంను ప్రచురితం చేసిందట.ఆ కథనంకు విజయ్ చాలా ఫీల్ అయ్యాడట.
సినిమాలో ఛాన్స్ వచ్చింది, ఒక సినిమా చేశాను అనే సంతోషం కూడా లేకుండా విజయ్ చాలా బాధపడేలా ఆ కథనం చేసిందని నటుడు సందీప్ అన్నాడు.విజయ్‌కి సందీప్ చాలా కాలంగా ఆప్త మిత్రుడు.
విజయ్‌పై ఈయనకు చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.కెరీర్ ఆరంభంలో విజయ్ ఎదుర్కొన్న ఇబ్బందులను సందీప్ కళ్లకు కట్టినట్లుగా వివరించాడు.
సందీప్ మాట్లాడుతూ.విజయ్ తొలి సినిమా విడుదలైన తర్వాత ఒక మీడియా సంస్థ తీవ్రంగా విమర్శిస్తూ కథనం రాసింది.ఆ కథనంకు ఒక రోజు రాత్రి అంతా కూడా విజయ్ ఏడుస్తూనే ఉన్నాడు.
దాంతో కసి పెంచుకున్న విజయ్ మరింతగా సినిమాల్లో ప్రయత్నాలు పెంచి, వచ్చిన ప్రతి ఒక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు.కొన్ని సంవత్సరాల్లోనే విజయ్‌పై విమర్శలు చేసిన మీడియా సంస్థ అదే విజయ్ కవర్ పేజ్‌తో మ్యాగజైన్‌ను రిలీజ్ చేసింది.
మొండి పట్టుదలలో విజయ్ తర్వాతే ఎవరైనా అంటూ సందీప్ పేర్కొన్నాడు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy