స్టార్ హీరో దళపతి విజయ్ జోసెఫ్( Thalapathy Vijay ) సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్( Lokesh Kanagaraj ) దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ పాన్ ఇండియన్ మూవీ ‘లియో‘ ( LEO ).ఈ సినిమా దసరా కానుకగా వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది.
అక్టోబర్ 19న ఈ సినిమా రిలీజ్ అయ్యి సెన్సేషన్ క్రియేట్ చేసింది.
ముందు నుండి భారీ అంచనాలు పెంచేసుకున్న ఈ సినిమా రిలీజ్ తర్వాత కూడా రికార్డులు క్రియేట్ చేస్తుంది.అయితే టాక్ పరంగా మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ దసరా సీజన్ కావడంతో ఈ సినిమాకు భారీ స్థాయిలో కలెక్షన్స్ వస్తున్నాయి.ఈ సినిమా డే 1 నే 115 కోట్లు వసూళ్లు చేసి సెంచరీ చేసింది.
ఇక అప్పటి నుండి సెంచరీల పరంపర ఆగడం లేదు.ఇప్పటికి రిలీజ్ అయ్యి నాలుగు రోజులు అవుతుండగా ఏకంగా 400 కోట్లను కొల్లగొట్టినట్టు టాక్.వరల్డ్ వైడ్ గా ఈ సినిమా 405.5 కోట్ల రూపాయలను రాబట్టినట్టు తెలుస్తుంది.ఇక మరో రెండు మూడు రోజులు ఈ సినిమాకు అడ్డే ఉండదు.సెలవులు కావడంతో లాంగ్ రన్ లో మరింతగా కలెక్షన్స్ రాబట్టే అవకాశం కనిపిస్తుంది.
కాగా ‘లియో’ ( LEO )సినిమాలో విజయ్ కు జంటగా స్టార్ హీరోయిన్ త్రిష ( Trisha )నటించింది.సంజయ్ సత్, గౌతమ్ మీనన్, అర్జున్, ప్రియా ఆనంద్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.సెవన్ స్క్రీన్ స్టూడియో పై లలిత్ కుమార్ భారీ స్థాయిలో నిర్మించిన ఈ సినిమాకు అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందించారు.