ఇప్పుడు ఉన్న సరోగసీ చట్టాల ప్రకారం .. నయన్ విగ్నేష్ లకు ఎన్నేళ్లు జైలు శిక్ష పడచ్చు

5 ఏళ్ళ పాటు ప్రేమించుకొని, సహజీవనం చేసి చివరికి తాళి బంధంతో ఒకటయ్యారు నయనతార, విగ్నేష్.పెళ్లి చేసుకుని మూడు నెలలు గడపకు ముందే సోషల్ మీడియాలో ప్రతి విషయాన్ని ట్రోల్ అవుతూ వస్తున్నారు ఈ దంపతులు.

 Legal Actions Against Nayan And Vignesh Couple , Legal Actions, Nayanatara , Vi-TeluguStop.com

తాజాగా సరోగసి ద్వారా కవల అబ్బాయిలకు జన్మనిచ్చామంటూ సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు ఈ దంపతులు.దాంతో అసలు వివాదం రాజుకుంది.

దారిన పోయే దరిద్రాన్ని నెత్తిన పెట్టుకున్నట్టుగా అయిపోయింది ప్రస్తుతం ఈ జంట పరిస్థితి.పెళ్లయిన తర్వాత హనీమూన్ ట్రిప్స్ ని బాగా ఎంజాయ్ చేస్తున్నట్టుగా సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిన ఈ జంట ప్రస్తుతం నెగిటివ్ కామెంట్స్ తో ట్రోలింగ్ కి గురవుతున్నారు.

సరోగసి పద్ధతిలో బిడ్డలకు జన్మనివ్వడం ఇండియాలో ఇటీవల బ్యాన్ చేశారు అనే విషయం వీరికి తెలుసో తెలియదో కానీ పెళ్లికి ముందే ఈ జంట పిల్లలకు జన్మను ఇవ్వాలని నిర్ణయించుకుని ఆ తర్వాత పెళ్లి చేసుకున్నట్టుగా కనిపిస్తోంది.దాంతో నాలుగు నెలల సమయం పూర్తికాకుండానే ఇద్దరు పిల్లలు పుట్టారు.

సాధారణంగా పిల్లలు కనే అదృష్టం లేని వారికి మాత్రమే సరోగసి పద్ధతి కి అనుమతిస్తుంది ప్రభుత్వం.మరి నయనతార విగ్నేష్ ఎలాంటి పరిస్థితులలో ఈ ప్రాసెస్ ని ఎంచుకున్నారో తెలియడం లేదు.

దాంతో ఈ విషయాన్ని తమిళనాడు ప్రభుత్వం అత్యంత సీరియస్ గా పరిగణించింది.

Telugu India, Kollywood, Nayanathara, Surrogacy, Twins, Vignesh-Latest News - Te

ఏ కారణాల చేత ఇంత సెలబ్రిటీ స్టేటస్ ఉన్న ఈ జంట సరోగసి ప్రాసెస్ కి వెళ్లారు అనే విషయంపై వివరణ ఇవ్వాల్సిందిగా ప్రభుత్వం నోటీసులు పంపించింది.ప్రభుత్వం నుంచి అంతకుముందే నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ తీసుకున్నట్లయితే ఈ ప్రశ్న తలెత్తేది కాదు.కానీ ఇటు సోషల్ మీడియా, అటు ప్రభుత్వం చేసిన దాడితో నయన్ దంపతులు అల్లాడిపోతున్నట్టుగా తెలుస్తుంది.

ఇల్లీగల్ గానే సరోగసి ప్రాసెస్ చేసి ఉన్నట్టు అయితే నయనతార విగ్నేష్ దంపతులు రూల్స్ ప్రకారం జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి కూడా రావచ్చు.అంతే కాదు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ కూడా జారీ చేసే అవకాశం ఉంది.

తక్కువలో తక్కువ వీరిద్దరికీ ఐదేళ్లపాటు జీవ శిక్ష పడే అవకాశం కూడా ఉంది.ఎంత సెలబ్రిటీ అయినా శిక్ష తగ్గించడం కుదరదు కాబట్టి సాధారణకు ఖైదీలకు పడే శిక్ష వీరికి పడుతుంది.

మరి ఇదంతా చూస్తుంటే నయనతార విగ్నేష్ పప్పులో కాలేశారా అని అనుకోకుండా ఉండలేని పరిస్థితి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube