వైసీపీలోకి వెళ్తే కూరలో కరివేపాకే ? ఈ ఫీలింగ్ ఎవరిదంటే ?

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లో గతంతో పోలిస్తే ఇప్పుడు చేరికలు బాగా తగ్గిపోయాయి.

అక్కడ అక్కడ చిన్న చిన్న నేతలు తప్పించి వైసీపీకి బాగా కలిసి వస్తారు అనుకున్న నేతలు ఎవరూ పెద్దగా చేరేందుకు ఆసక్తి చూపించడం లేదు.

నయానో భయానో కొంతమంది పార్టీలో చేరుతున్నారు తప్ప మిగతా నాయకులంతా సైలెంట్ అయిపోయారు.వైసీపీ లోకి వెళ్ళే కంటే ఉన్న పార్టీలోనే కామ్ గా ఉంటే బెటర్ అన్నట్టుగా చాలామంది నాయకులు వ్యవహరిస్తున్నారు.

వైసిపి 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత చేరికలు కనిపించాయి.టిడిపి, బిజెపి పార్టీ నుంచి నాయకుల వెళ్లారు .అలా వలస వెళ్ళిన నాయకుల్లో కొంతమందికి మాత్రమే ప్రాధాన్యం,  పదవులు దక్కగా మిగతా నాయకులంతా ప్రాధాన్యం కోల్పోయినట్లుగా వ్యవహరిస్తున్నారు.మొదటి నుంచి వైసీపీలో ఉన్న నాయకులకు కొత్తగా ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి మధ్య సఖ్యత ఇప్పటికీ ఏర్పడడం లేదు.

ఇప్పటికే వైసిపి లో గ్రూపు రాజకీయాలు ఎక్కువ అయిపోగా, టిడిపి తదితర పార్టీల నుంచి వచ్చిన వారు మరో వర్గం గా ఉంటున్నారు.పేరుకే తప్ప వేరే పనులు, మాట  చెల్లుబాటు కాకపోవడంతో అనవసరంగా పార్టీ మారామా అనే అభిప్రాయము సదరు నేతల్లో కలుగుతోంది.

Advertisement
Leaders Who Were Not Interested In Joining The Ycp From The Tdp, Ysrcp, Ap Cm, J

టీడీపీ నుంచి వైసిపిలో చేరిన ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ , మద్దాల గిరి , కరణం బలరాం , వాసుపల్లి గణేష్ వంటి వారు చేరినా,  ఆ తర్వాత పెద్దగా టిడిపి ఎమ్మెల్యేలు వైసీపీలోకి వెళ్లేందుకు ఆసక్తి చూపించలేదు.దీనికి కారణం టీడీపీ నుంచి వెళ్లిన ఎమ్మెల్యేలకు ఎదురైన పరిస్థితి.

వారు వై.సి.పి.లో అడ్జస్ట్ కాలేకపోవడం, తగిన ప్రాధాన్యం లేకపోవడం , వంటి కారణాలతో తమ పరిస్థితి కూరలో కరివేపాకులా వైసీపీలో ఉందనే అభిప్రాయం సదరు నేతల్లో నెలకొన్న పరిస్థితిని చూస్తున్నా, టిడిపి తదితర పార్టీల వారు వైసీపీ లోకి వెళ్లేందుకు ఆసక్తి చూపించడం లేదు.

Leaders Who Were Not Interested In Joining The Ycp From The Tdp, Ysrcp, Ap Cm, J

 అనవసరంగా పార్టీ మారి ప్రాధాన్యం కోల్పోవడం కంటే , ఉన్న పార్టీలోనే సైలెంట్ గా ఉంటే ఎప్పుడో ఒకప్పుడు పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు తమకు ప్రాధాన్యం ఉంటుందని,  అనవసరంగా పార్టీ మారడం వల్ల కొత్త తలనొప్పులు తెచ్చుకోవడం ఎందుకనే ఫీలింగ్ చాలా నియోజకవర్గాల్లో టీడీపీ, బీజేపీ నాయకుల్లో పెరిగిపోవడంతోనే వైసీపీ లో చేరికలు పెద్దగా కనిపించడం లేదట.అలాగే వైసిపి అధిష్టానాన్ని సైతం ఈ చేరికల ప్రోత్సహించే విషయంలో అంతగా ఆసక్తి చూపించడం లేదు.దీనికి కారణం ప్రస్తుతం అన్ని నియోజకవర్గాల్లో నెలకొన్న గ్రూపు రాజకీయాలే కారణం.

ఉన్న తలనొప్పులు చాలవు అన్నట్లు ఇతర పార్టీల నుంచి నాయకులను చేర్చుకున్నా, అనవసర తలనొప్పులు ఎదుర్కోవాలనే భయము వైసీపీ పెద్దల్లో నెలకొనడంతో ఈ విచిత్ర పరిస్థితిని ఆ పార్టీ ఎదుర్కోవాల్సి వస్తోంది.

Advertisement

తాజా వార్తలు