‘ముని 4’లో కాజల్‌

‘ముని’ సిరీస్‌ల్లో భాగంగా రాఘవ లారెన్స్‌ ప్రస్తుతం తెరకెక్కిస్తున్న చిత్రం ‘మొట్టు శివ, కెట్టు శివ’.ఇటీవలే ఈ చిత్రం షూటింగ్‌ ప్రారంభం అయ్యింది.

ఇటీవలే వచ్చిన ‘గంగా’ చిత్రం తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.దాంతో తాజాగా ఈ సినిమాపై కూడా తెలుగు ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి.

Kajal To Romance With Lawrence-Kajal To Romance With Lawrence-Latest News - Telu

‘ముని 4’గా రాబోతున్న ఈ సినిమాను తెలుగులో ‘నాగ’ టైటిల్‌తో విడుదల చేసే అవకాశాలున్నాయి.ఇక ఈ సినిమాలో హీరోయిన్‌గా కాజల్‌ ఎంపిక అయ్యింది.

తెలుగు, తమిళంలో స్టార్‌ హీరోయిన్‌గా గుర్తింపు ఉన్న కాజల్‌ ఒక హర్రర్‌ సినిమాలో నటించడం ఇదే ప్రథమం.ఈ సినిమాను లారెన్స్‌ స్వయంగా నిర్మిస్తున్నాడు.

Advertisement

కాజల్‌కు భారీ పారితోషికం ఇచ్చి మరీ ఈ సినిమాలో నటింపజేస్తున్నాడు.‘గంగ’ సినిమాలో తాప్సితో రొమాన్స్‌ చేసిన లారెన్స్‌ ఈసారి కాజల్‌తో సయ్యాటకు సిద్దం అవుతున్నాడు.

తెలుగుతో మంచి క్రేజ్‌ ఉన్న కాజల్‌ ఈ సినిమాకు తప్పకుండా ప్రధాన ఆకర్షణ అవుతుందని సినీ వర్గాల వారు అంటున్నారు.తాజాగా విడుదలైన ‘నాగ’ ఫస్ట్‌లుక్‌ స్టిల్స్‌ సినిమాపై అప్పుడే అంచనాలను తారా స్థాయికి తీసుకు వెళ్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు