ప్రభాస్ హెల్త్ పై లేటెస్ట్ అప్డేట్.. షూటింగ్ లో ఎప్పుడు జాయిన్ అవుతారంటే?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి ( Baahubali )సిరీస్ తో ఒక్కసారిగా పాపులర్ అయ్యాడు.

ఈ సిరీస్ తర్వాత ఈయన మార్కెట్ వరల్డ్ వైడ్ గా భారీగా పెరగడంతో ఈయన చేస్తున్న సినిమాలన్నీ కూడా భారీ హైప్ తెచ్చుకోవడమే కాకుండా భారీ బిజినెస్ కూడా జరుపు కుంటున్నాయి.

ప్రజెంట్ ప్రభాస్ పలు క్రేజీ ప్రాజెక్టులు లైన్లో పెట్టగా ఆ సినిమాలన్నీ వేగంగా షూటింగ్ జరుపు కుంటున్నాయి.

ఇదిలా ఉండగా ఈయన గత కొంత కాలంగా మోకాలి సమస్యతో( Knee problem ) బాధ పడుతున్నారు.అయితే ఇందుకోసం ఈయన సర్జరీ చేయించడం అవసరం అని యూకేకి వెళ్లారు.మరి ఈయన హెల్త్ అప్డేట్ కోసం ఫ్యాన్స్ అంతా ఎదురు చూస్తుండగా ఇప్పుడు ఒక వార్త తెలుస్తుంది.

ఈయన మోకాలి సర్జరీ సక్సెస్ ఫుల్ గా పూర్తి అయ్యిందని తెలిసింది.అయితే ఇప్పుడే ప్రభాస్ ( Prabhas )డిశ్చార్జ్ ఇమీడియట్ గా అవ్వదని కొద్దీ రోజుల వైద్యుల పర్యవేక్షణ తర్వాత డిశ్చార్జ్ అవుతుందని తెలుస్తుంది.

Advertisement

అందుకే కొద్దీ రోజుల పాటు అక్కడే రెస్ట్ తీసుకోవాలని ఆ తర్వాత ఇండియాకు రానున్నట్టు తెలుస్తుంది.అంతేకాదు ప్రభాస్ నవంబర్ వరకు రెస్ట్ లోనే ఉంటారని తెలుస్తుంది.

ఆ తర్వాతనే మళ్ళీ షూట్ లో జాయిన్ కానున్నట్టు టాక్.

ఇక ప్రభాస్ నటించిన సలార్ సినిమా ( Salaar )కోసం ఆడియెన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.ఈ సినిమా ఈ నెలలోనే రిలీజ్ అవ్వాల్సి ఉండగా వాయిదా పడింది.అయితే కిస్మస్ కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్టు తెలుస్తుంది.

ప్రశాంత్ నీల్( Prashanth Neel ) డైరెక్ట్ చేసిన ఈ మూవీలో ప్రభాస్ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటించింది.ఇదైనా బ్లాక్ బస్టర్ కావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

ఇంట్లోనే సూపర్ సిల్కీ హెయిర్ ను పొందాలనుకుంటే ఇలా చేయండి!
Advertisement

తాజా వార్తలు